ఓరి నాయనో.. మళ్లీ అలాంటి చోరీలు మొదలయ్యాయి?

praveen
ఇటీవల కాలం లో ఎక్కడ చూసినా దొంగల బెడద అంతకంతకు పెరిగి పోతుంది. ఉద్యోగం వ్యాపారం చేసుకుంటూ సభ్య సమాజంలో గౌరవం గా బ్రతకడం కంటే ఇక ఏదో ఒక విధంగా చోరీ చేసి అందిన కాడికి దోచుకు పోయి వచ్చిన దాంతో జల్సాలు చేయాలని ఎంతో మంది భావిస్తున్నారు. వెరసి ఇలాంటి ఆలోచన శైలి చాలా మందికి ఇబ్బందులకు గురిచేస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఎక్కడికక్కడ సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసినప్పటికీ అటు దొంగల బెడద మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ఇక ఎంతో చాకచక్యంగా దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసిరుతున్నారు ఎంతో మంది.



 అయితే కొన్ని కొన్ని సార్లు మాత్రం వింతైన చోరీలకు సంబంధించిన ఘటనలు సోషల్ మీడియా లో వెలుగు లోకి వస్తూ ఉంటాయి. ఏకంగా విలువైన బంగారు ఆభరణాలు వస్తువులను దొంగలించడం మానేసి ఏకంగా కూరగాయలను దొంగలించే వారు కూడా అప్పుడప్పుడు తారస  పడుతూ ఉంటారు. గతం లో ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటిన తరుణం లో.. ఎంతో మంది ఉల్లిపాయల బస్తాలను కూడా చోరీ చేసిన ఘటనలు వెలుగు లోకి వచ్చాయి.


 అయితే ఇప్పుడు ఉల్లిపాయ ధర తగ్గింది. కానీ టమాటా ధర మాత్రం ఆకాశాన్ని అంటుతుంది. దీంతో ఒకప్పుడు ఉల్లిపాయలు చోరీ చేసినట్లు గానే ఇప్పుడు ఏకంగా టమాటాను దొంగలించడం మొదలు పెడుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటన జరిగింది. కర్ణాటక లోని హసన్ జిల్లాలో గోని సోమనహళ్లి గ్రామానికి చెందిన ధరణి అనే మహిళ రైతు పొలం లో దొంగలు పడ్డారు. ఏకంగా 2.5 లక్షల విలువైన 60 బస్తాల టమాటలను దొంగలు ఎత్తుకెళ్లారని.. మిగిలిన పంటను ధ్వంసం చేశారని బాధిత రైతు ఆరోపించారు. అప్పు తెచ్చి టమాటా సాగు చేసామని.. ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: