పెంపుడు పిల్లి.. రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది?
అయితే కొన్ని కొన్ని సార్లు ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు జంతువుల విషయంలో కూడా చివరికి గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. మనం ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు జంతువులు.. పక్కింట్లోకి వెళ్లడం.. ఇక వారికి నచ్చక వాళ్ళు పెంపుడు జంతువులను కొట్టడం.. ఇక తద్వారా గొడవ జరిగటం ఇప్పుడు వరకు ఎన్నోసార్లు జరిగింది. అయితే ఇక్కడ కూడా ఏకంగా ఒక పెంపుడు పిల్లి కారణంగా రెండు కుటుంబాల మధ్య గొడవ మొదలైంది అని చెప్పాలి. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.
కృష్ణాజిల్లా గన్నవరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఒక పిల్లి ప్రాణాలు పోవడం ఏకంగా రెండు కుటుంబాల మధ్య గొడవకు కారణమైంది. అంతేకాదు ఇక ఇరు కుటుంబాల సభ్యులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఒకరిపై ఒకరు కేసు పెట్టుకునేంతవరకు దారితీసింది. షేక్ చానా అనే మహిళ పెంచుకుంటున్న పర్షియన్ జాతిపిల్లి ఇటీవల రోడ్డు పక్కన చనిపోయింది. దీంతో తన ఇంటి పక్కన ఉన్న కుమార్ ఇక తన పెంపుడు పిల్లిని చంపాడు అంటూ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది సదరు మహిళ. గతంలో పెళ్లి విషయంలో గొడవ కూడా జరిగింది అంటూ చెప్పింది. అయితే తనకు పిల్లిని చంపాల్సిన అవసరం లేదు అంటూ కుమార్ చెబుతూ ఉండడం గమనార్హం.