వ్యవసాయం చేస్తున్నాడని పెళ్లి కాలేదు.. చివరికి రైతు ఏం చేశాడంటే?

praveen
దేశానికి రైతే రాజు అని ఎంతోమంది నాయకులు చెబుతూ ఉంటారు. రైతు కారణంగానే ప్రతి ఒకరు మూడు పూటలా హాయిగా భోజనం చేయగలుగుతున్నారు అని ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. కానీ ఇలా దేశం కడుపు నింపుతున్న ఆ రైతన్నకు మాత్రం ప్రతిరోజు దినదిన గండం గానే మారిపోతుంది. ఎందుకంటే ప్రభుత్వాలు పట్టించుకోక.. ప్రకృతి పగబట్టినట్లు వ్యవహరించి చివరికి అన్నం పెట్టే రైతన్న దిక్కు తోచని స్థితిలో పడిపోతున్న పరిస్థితి నెలకొంది. ఆరుగాలం కష్టపడిన తర్వాత ప్రకృతి పగబట్టినట్లు వ్యవహరించడంతో పెట్టిన పెట్టుబడి కూడా రాక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

 ఇవన్నీ పక్కన పెడితే రైతు గా ఉంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుంది అన్నదానికి ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఒక ఘటన నిదర్శనంగా మారిపోయింది అని చెప్పాలి. ఇటీవల కాలంలో ఎక్కువ భూములు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న ఎంతోమంది అమ్మాయిలు.. అదే భూమిలో సాగు చేస్తున్న రైతును పెళ్లి చేసుకోవాలంటే మాత్రం అసలు ఇష్టపడటం లేదు. దీంతో ఇక పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పెళ్ళికొడుకు వ్యవసాయం చేస్తున్నాడు అంటే చాలు ఇక పెళ్లిని నిర్మొహమాటంగా క్యాన్సల్ చేసుకుంటున్నారు.

 ఇక కర్ణాటకలో కూడా ఇలాంటి తరహా ఘటనే వెలుగు లోకి వచ్చింది. హవేరీ జిల్లాలో ఒక రైతుకు ఎన్ని సంబంధాలు చూసిన పెళ్లి కాలేదు. వ్యవసాయం చేస్తున్నాడు అన్న కారణంతో అన్ని సంబంధాలు క్యాన్సిల్ అయ్యాయి. దీంతో మనస్థాపం చెందిన రైతు మంజునాథ్ ఇటీవల విషయం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక సూసైడ్ నోట్ కూడా రాశాడు అని చెప్పాలి. గత 8 ఏళ్ళుగా పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరకడం లేదని.. సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు మంజునాథ్. తనకు పెళ్లి కాకపోవడంతో తల్లిదండ్రులు కూడా తీవ్ర నిరాశలో మునిగిపోయారని.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు మంజునాథ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: