పోలీసులు పెళ్లి ఆపితే.. కోర్టు వివాహం చేసింది?

praveen
సినిమాల్లో ఉండే కొన్ని సన్నివేశాలు కొన్ని కొన్ని సార్లు అటు నిజజీవితంలో కూడా రిపీట్ అవుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇలాంటివి చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతుంటారు. ముఖ్యంగా పెళ్లి జరుగుతున్న సమయంలో సినిమాల్లో లాగా పెళ్లి మండపంలోకి పోలీసులు వచ్చి పెళ్లి ఆపండి అంటూ అందరికీ షాక్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటివి నిజ జీవితంలో జరగవు అని కొన్నిసార్లు అనుకున్న.. ఇక జరిగిన తర్వాత మాత్రం షాక్ అవ్వడం అందరి వంతు అవుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.


 భాజా భజంత్రీల మధ్య పెళ్లి జరుగుతున్న సమయంలో సరిగ్గా తాళి కట్టే సమయానికి పోలీసులు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. సినిమా స్టైల్ లోనే పెళ్లి ఆపండి ఆపండి అంటూ అందరికీ షాక్ ఇచ్చారు. అయితే సినిమాల్లో ఎక్కువగా పెళ్లి కొడుకు ఇక  అందరిని మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ కారణం చెప్పి ఇక అతన్ని అందరి ముందే పోలీస్ స్టేషన్ కి ఈడ్చుకెల్లడం చూస్తూ ఉంటాం. ఇక్కడ మాత్రం పూర్తిగా సీన్ రివర్స్ అయింది. పెళ్లికొడుకుని కాదు ఏకంగా పెళ్లికూతురును తీసుకెళ్లారు పోలీసులు. అదేంటి పెళ్లికూతురును తీసుకెళ్లడం ఏంటి ఇదేదో వినడానికి విచిత్రంగా ఉంది అని అనుకుంటున్నారు కదా.


 అంతకుముందు పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయి మిస్సింగ్ అయింది అంటూ కేసు నమోదు అయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఏకంగా పెళ్లి జరుగుతున్న సమయంలో సరిగ్గా తాళి కట్టే సమయానికి అమ్మాయిని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు అని చెప్పాలి.  ఈ ఘటన కేరళలో వెలుగులోకి వచ్చింది. ఏకంగా పెళ్లికూతురు రాను అంటూ చెప్పిన కూడా బలవంతంగా ఆమెను తీసుకువెళ్లి.. నేరుగా కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే పెళ్లికూతురు కిడ్నాప్ అయిందంటూ కేసు నమోదు కావడంతోనే ఇలా చేసినట్లు కోర్టు ముందు పోలీసులు తెలిపారు. ఇక కోర్టు ఆదేశాల మేరకు ఇలా చేసినట్లు పోలీసులు చెప్పడం గమనార్హం. అయితే వారిద్దరూ కూడా మేజర్లు కావడంతో కోర్టు పెళ్లికి అంగీకరించింది. ఈ  క్రమంలోనే మరుసటి రోజు ఇక వీరిద్దరికి పెళ్లి జరిగింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: