8.49 కోట్లు దోచుకున్నారు.. కానీ రూ.10 కక్కుర్తి పట్టించింది?
అయితే ఇలాంటివి కేవలం సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోను జరుగుతాయి అన్నదానికి నిదర్శనంగా ఇప్పటివరకు ఎన్నో రకాల ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఇటీవల ఉత్తరాఖండ్లో కూడా ఇలాంటి ఒక ఆశ్చర్యకరమైన ఘటనే జరిగింది. పంజాబ్ కు చెందిన ఒక జంట 8.49 కోట్ల రూపాయలను దోచుకుని పారిపోయింది. అయితే చివరికి పది రూపాయల కూల్ డ్రింకు కక్కుర్తి పడి ఇక పోలీసులకు దొరికిపోయింది ఈ జంట. ఇంతకీ ఏం జరిగిందంటే.. పంజాబ్ లోని లూథియానాలో ఈ నెల 10న సీఎంఎస్ సెక్యూరిటీస్ అనే సంస్థలో దాదాపు 8.49 కోట్ల దోపిడీ జరిగింది.
ఇక ఆ తర్వాత సంస్థ నిర్వాహకులు పోలీసులు ఆశ్రయించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హసీనాగా పేరున మందీప్ కౌర అనే మహిళను నిందితురాలుగా గుర్తించారు. అయితే అంతకుముందు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మన్దీప్ గౌడ్, భర్త జష్వేందర్ సింగ్ తో కలిసి పంజాబ్ విడిచి వెళ్లిపోయారు. అయితే నేపాల్ వెళ్లి అక్కడే సెటిల్ అవ్వాలనుకున్న ఆ జంట అంతకుముందు హరిద్వార్ కేదార్నాథ్ తో పాటు క్షేత్రాలకు వెళ్లాలని అనుకున్నారు. అయితే ఉత్తరాఖండ్లో లోక పుణ్యక్షేత్రంకి చోరీ చేసిన జంట వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన పోలీసులు భక్తులు ఎక్కువగా ఉండడంతో వారిని గుర్తించి పట్టుకునేందుకు ఒక పథకం వేశారు. ఉచితంగా కూల్ డ్రింకులు ఇచ్చేలా ఒక స్టాల్ ఏర్పాటు చేశారు ఇక స్టాల్ వద్దకు భక్తులు వస్తుండగా చివరికి దంపతులు కూడా ఆ పది రూపాయల కూల్ డ్రింక్స్ కోసం కక్కుర్తి పడి అక్కడికి వచ్చారు. దీంతో అక్కడే మాటు వేసుకొని కూర్చున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు.