అతని వయస్సు 14 ఏళ్ళే.. కానీ ఈ ఏజ్ లో?
క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలా కారణంగా.. ఎంతో మంది బలవన్మరణాలకు పాల్పడుతూ ఇక కుటుంబాల్లో తీరని శోఖాన్ని నింపుతున్నారు. అంతేకాదు నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి ఒక విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా 14 ఏళ్ల వయస్సు ఉన్న బాలుడు ఏం చేస్తాడు అంటే.. స్నేహితులతో ఆడుకోవడం లేదంటే ఇక చదువుకోవడం చేస్తూ ఉంటాడు అని అందరూ అంటారు. కానీ ఇక్కడ 14 ఏళ్ల బాలుడు ఏం కష్టం వచ్చిందో చివరికి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. అభం శుభం తెలియని వయసులో చివరికి జీవితాన్నే ముగించేసాడు.
పెద్ద శంకరంపేట ఇందిరా కాలనీలో నివాసం ఉంటున్న 14 ఏళ్ల శివ తన నివాసంలో ఇటీవలే దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే శివ ఆత్మహత్య చేసుకోవడంతో అటు గ్రామస్తులందరూ కూడా షాక్ అవుతారు అని చెప్పాలి. ఇంత చిన్న వయసులో అతనికి అంత కష్టం ఏం వచ్చిందో అని అందరూ కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.