ప్రేమ పెళ్లి.. కానీ ఊహించని ట్విస్ట్ ఇచ్చిన యువకుడు?

praveen
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితం లో ఒక ప్రత్యేకమైన ఘట్టం. జీవితాంతం సుఖ సంతోషాలతో మెలగడానికి ఇక నచ్చిన భాగస్వామిని జీవితం లోకి ఆహ్వానిస్తూ ఉంటారు యువతి, యువకులు. ఈ క్రమం లోనే పెళ్లిపై కోటి ఆశలు పెట్టుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇక ముఖ్యంగా అమ్మాయిలు అయితే పెళ్లి గురించి ఎన్నో కలలు కంటూ ఉంటారు. కాబోయే వరుడు తనను మహారాణిలా చూసుకుంటాడని  కోటి ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. ఇక మెట్టినింట్లో అడుగుపెట్టిన తర్వాత అక్కడ అత్తమామలు సొంత తల్లిదండ్రుల్లాగానే ప్రేమను పంచుతారని ఆశ పడుతూ ఉంటారు.

 మేఘాలలో నుంచి కీలు గుర్రంపై వరుడు దిగి రావాల్సిన పనిలేదు ఏ కష్టం రాకుండా చూసుకుంటే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒక యువతి పెళ్లి గురించి ఇలాగే కోటి ఆశలు పెట్టుకుంది. పైగా ప్రేమించిన వాడితో పెళ్లి కావడంతో మరింత సంతోషంగా ఉంది. కానీ అంతలోనే ఆ యువతికి ఊహించని చేదు అనుభవం ఎదురయింది. ఇక ప్రేమించిన వాడు  పెళ్లి  చేసుకుని సంతోషంగా చూసుకుంటాడు అనుకుంటే పెళ్లికి ముందే ఊహించని షాక్ ఇచ్చాడు. పెళ్లి మరికొన్ని రోజుల్లో జరగబోతుంది అనుకుంతుండగా.. ఇక మరో యువతిని పెళ్లి చేసుకుని ట్విస్ట్ ఇచ్చాడు.

 దీంతో ఈ విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయిన యువతి చివరికి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన కర్నూల్ లో జరిగింది అని చెప్పాలి. ఇందిరాగాంధీ నగర్ కు చెందిన పద్మావతి.. నందికొట్కూరు పాతకోటకు చెందిన వినోద్ ప్రేమించుకున్నారు. పెద్దలు కూడా అంగీకరించారు. మార్చి 9న ఎంగేజ్మెంట్ చేశారు. ఈనెల పదవ తేదీన పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే ఇంతలోనే వినోద్ మరో యువతని పెళ్లి చేసుకున్నాడు దీంతో మనస్థాపం చెందిన పద్మావతి చివరికి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: