గోవాలో మద్యం.. ఎందుకు అంత చీప్ తెలుసా?

praveen
గోవా అనగానే అందరికీ ఎంతో అందమైన బీచ్ లు, అద్భుతమైన రైడ్లు, క్యాసినోలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుందని గుర్తుకు వస్తూ ఉంటుంది. అందుకే ఎంతో మంది యువకులు కాస్త ఖాళీ సమయం దొరికిందంటే చాలు గోవా చెక్కేసి  అక్కడ ఎంజాయ్ చేయాలని ఆశ పడుతూ ఉంటారు. దేశియా పర్యటకులకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే ఎంతో మంది టూరిస్టులకు గోవా అనేది ఒక ఫేవరెట్ డెస్టినేషన్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే గోవా ఇలా ప్రకృతి సౌందర్యంతో మాత్రమే కాదు మరో విషయంలో కూడా బాగా ప్రసిద్ధి చెందింది.


 అదే బీర్ విషయంలో. గోవాలో బీర్ ఎంత చౌకగా లభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా మందుబాబులు ఇలా చౌకైన బీర్లను తాగేందుకు ఇష్టపడుతూ గోవాకి వెళ్లడం చేస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇతర రాష్ట్రాల్లో నీళ్ల ధర ఎలా ఉంటుందో గోవాలో బీర్ ధర అలాగే ఉంటుంది. ఈ క్రమంలోనే గోవాకు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ చౌకగా లభించే బీర్లను తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ గోవాలో ఎందుకు ఇంత చౌకగా బీర్ లభిస్తుంది అని మాత్రం చాలామంది ఆలోచించరు. మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఇక్కడ బీరు ధరలు దాదాపు 25శాతం తక్కువగా ఉంటాయి.



 అయితే ఇక్కడ బీర్ ఇంత చౌకగా ఉండడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. గోవాలో మద్యంపై పన్ను చాలా తక్కువగా ఉంటుందట. దీని కారణంగానే ఇక్కడ బీర్లు ఇతర రాష్ట్రాల కంటే చాలా తక్కువ ధరకు లభిస్తాయి. ఇక దేశంలో మద్యం జీఎస్టీ లోకి రాదు. దీంతో మద్యం ధరలను నిర్ణయించడంలో రాష్ట్ర ప్రభుత్వమే కీలకపాత్ర వహిస్తుంది. అదే సమయంలో గోవాలో మద్యం అమ్మడం కోసం టెండర్ పొందడం కష్టమైన పని కూడా కాదు. ఇక్కడ మద్యం షాపులు సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పోటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ పోటీ వల్ల కూడా మద్యం ధరలు తక్కువగా ఉంటాయి. ఇక పర్యటకులను ఆకర్షించేందుకు కూడా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా బీర్ రేట్లను పెంచలేదట. ఇక మరోవైపు మద్యానికి అవసరమైన ముడిసరుకు కూడా గోవాలో సులభంగా దొరుకుతుందట. ఇక ఇలాంటి కారణాలవల్లే గోవాలో బీర్ చౌకగా దొరుకుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: