హిజ్రాలు అసభ్యంగా ప్రవర్తిస్తే.. ఇలా చేయండి?

praveen
ఇటీవల కాలంలో ట్రాన్స్ జెండర్లు తమకు సరైన గుర్తింపు కోసం పోరాడుతున్నారు. ఏకంగా ఉద్యోగం వ్యాపారంలో రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు సభ్య సమాజం నుంచి చీదరింపులు ఎదురవుతున్న తమ కాళ్ళ మీద తమ నిలబడి అందరికీ ఆదర్శంగా నిలవాలని ఎంతో మంది ట్రాన్స్ జెండర్లు పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఇలాంటి సమయంలో కొంతమంది ట్రాన్స్ జెండర్లు మాత్రం ఏకంగా సభ్య సమాజంలో ఇంకా జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.



 ఇలా కొత్తగా గృహప్రవేశం అయిన లేదంటే కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించిన కూడా అక్కడికి వచ్చే ట్రాన్స్ జెండర్లు భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో డబ్బులు ఇవ్వలేము అంటే అసభ్యంగా ప్రవర్తించడం లాంటివి చేస్తున్నారు. ముఖ్యంగా ఇక అటు పెళ్లి వేడుకలలో అయితే ట్రాన్స్ జెండర్లు చేస్తున్న రచ్చ అంతా కాదు అని చెప్పాలి. దీంతో ఇక ఎంతోమంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటీవల ఏలూరు జిల్లా నూజివీడులోని ఒక వివాహ వేడుక వద్ద కూడా ట్రాన్స్ఫర్లు డబ్బులు డిమాండ్ చేస్తూ అతిధుల ముందు అసభ్యంగా ప్రవర్తించారు.


 దీంతో వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమం  లోనే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు కళ్యాణ వేదికలు, షాప్లు, టోల్ గేట్ల వద్ద డబ్బులు వసూలు చేసే హిజ్రాల గ్రూపులను పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పించారు. అయితే శుభకార్యాల వద్ద పాలు తోచింది ఇస్తే తీసుకొని దీవించి వెళ్ళాలి.  కానీ బెదిరింపులకు పాల్పడి ప్రతిష్టకు బంధం కలిగేలా చేస్తే చర్యలు తీసుకుంటామని సిఐ అంకబాబు హెచ్చరించాడు. ఇక ఎవరైనా ఇలా వివాహ వేదికల వద్దకు వచ్చి హిజ్రాలు ఇబ్బందులకు గురి చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలి అంటూ సూచించాడు. హిజ్రాల ఆగడాలు శృతిమించితే ఊరుకునేది లేదు అంటూ హెచ్చరించారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: