అర్ధరాత్రి లవర్ ని కలవడానికి సీక్రెట్ గా వెళ్ళాడు.. కానీ ఏం జరిగిందో చూడండి?
బీహార్ లో జరిగిన హై వోల్టేజ్ లవ్ డ్రామాకు గ్రామస్తులు చివరికి పెళ్లితో ముగింపు పలికారు. చన్ పాటీయా బ్లాక్ లోని గిద్ద పంచాయితీ చౌరహియకు చెందిన రంజన్ కుమార్ యాదవ్, లౌకారియా గ్రామానికి చెందిన ఊర్మిళ అనే యువతిని ప్రేమించాడు. ప్రియురాలిని కలిసేందుకు రాత్రి వేళ ఆమె ఇంటికి వెళ్ళాడు. ఇక ఇద్దరు సీక్రెట్ గా కలుసుకున్న సమయంలో యువతి కుటుంబ సభ్యులు వీరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక వెంటనే పెళ్లి చేసుకోమని కుటుంబ సభ్యులు గ్రామస్తులు అందరూ కూడా యువకుడిని నిలదీశారు.
అయితే ఇక వారి కళ్ళు కప్పి రంజన్ కుమార్ యాదవ్ ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. దీంతో ఇక ఇరు వర్గాల మధ్య చర్చల నేపథ్యంలో అక్కడ అర్ధరాత్రి మొత్తం హైడ్రామా నడిచింది అని చెప్పాలి. చివరికి ఇద్దరినీ కూడా పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే పోలీసులు ఇక రంజన్ కుమార్, ఊర్మిలకు పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని లిఖిత పూర్వక హామీ తీసుకున్నారు. ఇక ఎట్టకేలకు వీరిద్దరికి పెళ్లి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.