మా నాన్నను అరెస్టు చేయండి.. పోలీసులకే షాకిచ్చిన బుడ్డోడు?

praveen
సాధారణంగా పిల్లలు తండ్రి కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడటానికి ఎంతగానో భయపడిపోతూ ఉంటారు. అయితే తండ్రి ఎంత స్నేహంగా మెలిగినప్పటికీ పిల్లలు ఇక ధైర్యంగా తండ్రికి ముందు అన్ని విషయాలు చెప్పడానికి కాస్త వెనకడుగు వేస్తూ ఉంటారు అని చెప్పాడు. ఎందుకో తెలియదు కానీ తరతరాల నుంచి తండ్రి అంటే పిల్లలు ఏదో తెలియని భయం.. లోలోపల దాగి ఉంటుంది. సాధారణంగా స్నేహంగా ఉండే తండ్రి అంటేనే పిల్లల భయపడిపోతారు. అలాంటిది ఇక నిత్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ పడే తండ్రి అంటే.. ఇక అతని దగ్గరికి వెళ్లడానికి కూడా జంకుతూ ఉంటారు.



 కానీ అదంతా వేరొకరికి.. ఇలాంటివి తనకు వర్తించవు అన్న విషయాన్ని ఇక్కడ ఒక పిల్లాడు నిరూపించాడు. ఎందుకంటే ప్రతిరోజు తాగి వస్తూ గొడవ పడుతున్న తండ్రిని చూసి విసిగిపోయి.. ఏకంగా తండ్రికి బుద్ధి చెప్పాలి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తండ్రి ప్రతిరోజు తాగొచ్చి తల్లిని కొడుతున్నాడని.. ఆమె బాధను చూడలేకపోతున్నానని.. ఇక తన తండ్రిని అరెస్టు చేసి బుద్ధి చెప్పాలి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఇలా తండ్రి తీరుపై ఫిర్యాదు చేసిన ఆ బాలుడి వయస్సు.. కేవలం 9 ఏళ్ళు మాత్రమే కావడం గమనార్హం.


 ఈ ఘటన బాపట్ల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కర్లపాలెం పాత ఇస్లాంపేటకు చెందిన సుభాని, సుభాంబి భార్యాభర్తలు. అయితే వారిద్దరికీ ఒక కుమారుడు ఉన్నాడు. శుభాని రైస్ మిల్లులో పనిచేస్తూ ఉంటాడు. ఇక అలాగే కుట్టు పని చేస్తూ కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటుంది సుబాంబి. సుభాని రోజు మద్యం తాగి వచ్చి ఇక రాత్రుళ్ళు భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. ఇక ప్రతిరోజు ఆమెను దారుణంగా కొట్టేవాడు. రోజు ఇలా భార్యాభర్తల గొడవను చూసిన కొడుకు రహీం ఇక తల్లి బాధను చూసి తట్టుకోలేకపోయాడు. నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. తండ్రి ప్రవర్తిస్తున్న తీరును పోలీసులకు వివరించి వెంటనే తండ్రికీ బుద్ధి చెప్పాలి అంటూ వేడుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ దంపతులను పిలిపించిన పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి ఇలాంటిది జరిగితే ఊరుకోబోము అంటూ హెచ్చరించి పంపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: