భార్యను ముక్కలుగా నరికేశాడు.. అంతటితో ఆగకుండా?

praveen
భార్య భర్తల బంధం అంటే అన్యోన్యతకు చిరునామాగా పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే పెళ్లి అనే బంధంతో ఒక్కటైన యువతి యువకులు ఇక వందేళ్లపాటు కలిసి జీవించడానికి.. కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడు నీడగా ఉండడానికి అంగీకరిస్తూ ఉంటారు. అందుకే ఏ బంధంలో లేనంత అన్యోన్యత అటు దాంపత్య బంధం లో ఉంటుంది అనేది పెద్దలు చెప్పే మాట. కానీ ఇదంతా ఒకప్పటి కాలంలో కానీ నేటి రోజుల్లో మాత్రం భార్యాభర్తల బంధం అంటే మనస్పర్ధలు, గొడవలు, హత్యలు, ఆత్మహత్యలు తప్ప.. ఇంకేం కనిపించడం లేదు. సర్దుకుపోయి ఒకరిని ఒకరు అర్థం చేసుకుని బ్రతకడం మానేసి.. ఈగోలకు పోయి దాంపత్య బంధాన్ని లెక్కచేయడం లేదు ఎంతోమంది.


 వెరసి చిన్న చిన్న గొడవలకే మనస్థాపంతో ఇక దాంపత్య బంధానికి స్వస్తి పలుకుతున్న వారు కొంతమంది అయితే.. కట్టుకున్న వారిని దారుణంగా హతమారుస్తున్న వారు మరి కొంతమంది.. ఇంకొన్ని ఘటనల్లో ఇక జీవితం నాశనమైంది అని భావిస్తూ మన స్థాపంతో ఆత్మహత్య చేసుకుంటూ బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు కొంతమంది. వెరసి భార్యాభర్తల బంధం అంటే మాత్రం ప్రాణాలు పోవడానికి చిరునామాగా మారింది.


  అయితే ఇటీవలే  ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో కూడా ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. వీరపాలెంలో ఏకంగా భార్యను దారుణంగా ముక్కలుగా నరికేసాడు దుర్మార్గపు భర్త. మద్యానికి బానిసైన గంజి దావీదు డబ్బు కోసం తరచూ భార్య నిర్మలను వేధిస్తూ ఉండేవాడు. దీంతో తన ఇద్దరు కుమార్తెలు కొడుకును పుట్టింట్లోనే వదిలి ఉపాధి కోసం కువైట్ వెళ్లిపోయింది నిర్మల. అయితే తాను మారిపోయానని నమ్మించి ఇటీవలే భార్యను ఇంటికి రప్పించాడు. ఇక తర్వాత తెల్లవారుజామున నిర్మల మెడ చేయిని నరికేశాడు. దీంతో ఆమె రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: