భర్తకు దూరంగా యువతి.. లొంగదీసుకునేందుకు మాజీ ప్రియుడి స్కెచ్.. చివరికి?

praveen
భర్తకు దూరం గా ఉంటూ ఒంటరిగా జీవిస్తున్న మహిళ పట్ల అందరికీ చులకన బావనే. అయితే ఇది సినిమాల్లో ఎక్కువగా వినిపించే డైలాగ్. అయినప్పటికీ అటు నిజ జీవితంలో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే భర్తకు దూరంగా ఉండి ఒంటరిగా జీవిస్తూ తన కాళ్ళ మీద తను నిలబడి ఒక అమ్మాయి బ్రతుకుతున్నప్పటికీ కూడా ఎంతోమంది మాయ మాటలు చెప్పి మోసం చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఆర్థిక అవసరాలు తీర్చు కోవడం కోసం మాయమాటలు చెప్తే మరి కొంత మంది శారీరక అవసరాలు తీర్చుకోవడం కోసం వెంటపడుతూ ఉంటారు.

 ఇక్కడ ఒక యువతకి ఇలాంటి చేదు అనుభవం ఎదురయింది. ఏకంగా భర్తకు దూరంగా ఉంటున్న యువతిని లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు ఒక యువకుడు. దీంతో భయపడిపోయిన యువతి వెంటనే పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. వోలింపస్ రామస్వామి నగర్కు చెందిన 20 ఏళ్ల యువతి కోవై ఉక్కడం ప్రాంతంలో నివాసం ఉండే శర్వాననన్ అనే యువకుడిని గతంలో ప్రేమించింది. అయితే వీరికి విభేదాలు రావడంతో విడిపోయారు.

 ఇక తర్వాత యువతి మరో వ్యక్తిని వివాహం చేసుకుంది అని చెప్పాలి. కొన్ని సంవత్సరాలు వారి కాపురం సజావుగానే సాగింది. కానీ ఆ తర్వాత మనస్పర్ధలు మొదలయ్యాయి. దీంతో ఇక భర్తకు దూరంగా ఒంటరిగానే ఉండటం మొదలు పెట్టింది సదరు వివాహిత. ఈ క్రమంలోనే మాజీ ప్రియుడు ఆమెపై కన్నేసాడు. ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. ఇక తనను ప్రేమించాలి అంటూ వేధింపులకు గురి చేసేవాడు. ఆ యువతి  నిరాకరించడంతో దాడి చేస్తాను అని బెదిరింపులకు పాల్పడేవాడు. దీంతో వేధింపులు తట్టుకోలేకపోయిన వివాహిత పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శరవ నన్ అరెస్టు చేసి జైలుకు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: