భారీ ఆస్తులు ఉన్నా.. ఆ ఊరీ అబ్బాయిలు మాకొద్దంటున్న అమ్మాయిలు?
లక్షల రూపాయల ఆదాయం ఉన్న కూడా అక్కడ అబ్బాయిలను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు అని చెప్పాలి. ఇక ఆ గ్రామం పేరు ఎత్తితేనే అందరీ ముఖాలు మాడిపోతున్నాయి. దీంతో విసుగెత్తిపోయిన ఆ ఊరి జనం గ్రామాన్ని వదిలి పక్క గ్రామాలకు వెళ్ళిపోతున్నారు. రాజస్థాన్లోని ఉదయపూర్ జిల్లాలో ఉన్న పీపాడు గ్రామంలో ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఆ ఊరిలో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ ఇంటర్నెట్ సౌకర్యం మాత్రం లేదు అని చెప్పాలి. అయితే మొబైల్ కంపెనీలు సెల్ టవర్ ఏర్పాటు చేశాయి. కానీ అవి గ్రామస్తులకు ఎక్కడ ఉపయోగపడటం లేదు.
కారణం ఆ గ్రామం భౌగోళిక స్వభావమే అని చెప్పాలి. లోతట్టు ప్రాంతంలో ఉన్న ఈ గ్రామానికి సెల్ఫోన్ సిగ్నల్ ఉండదు. దీంతో ఆ గ్రామస్తులకు ఇంటర్నెట్ సౌకర్యం అనేది లేకుండా పోయింది అని చెప్పాలి. పరిస్థితి ఎంత దారుణంగా మారింది అంటే రేషన్ షాప్ డీలర్లు సైతం తమ వద్ద ఉన్న పి ఓ ఎస్ పరికరాలు ఉపయోగించుకునేందుకు సమీపంలోని గుట్టపైకి ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం లబ్ధిదారులు కూడా రోజువారి హాజరు వేసుకునేందుకు గుట్ట ఎక్కకు తప్పడం లేదు. ఇలా ఇంటర్నెట్ సదుపాయం లేని ఆ గ్రామంలోని అబ్బాయిలను పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు అస్సలు ఇష్టపడటం లేదు. లక్షలు సంపాదిస్తున్న అలాంటి గ్రామానికి కోడలుగా అస్సలు వెళ్ళబోము అంటూ తెగేసి చెబుతున్నారు. పెళ్లయిన వారు భర్తలను తీసుకొని వేరే ప్రాంతాలకు వెళుతూ ఉండడం గమనార్హం.