మలద్వారం నుండి కడుపులోకి పాము.. డాక్టర్ల దగ్గరికి వెళ్తే?
కానీ కొన్ని కొన్ని సార్లు ఎంతో అనుభవం ఉన్న డాక్టర్లను సైతం నోరేళ్లపెట్టేలా చేసే కొన్ని కేసులు వైద్యుల దగ్గరికి వస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో కొంతమంది ఏకంగా సెల్ఫోన్లని మింగటం లేదా మలద్వారం ద్వారా ఏకంగా గాజు గ్లాస్ ని లోపలికి చొప్పించడం లాంటి ఘటనలు చాలానే వైద్యులను షాక్ కి గురిచేసాయి. అంతేకాదు ఏకంగా పేషెంట్ కడుపులో బ్లేడ్లు ఉండడం.. ఇక భారీగా వెంట్రుకలు బయటపడటం లాంటికేసులు కూడా వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసాయి అని చెప్పాలి.
ఇక ఇటీవల యూపీలో అయితే మరింత విచిత్రమైన ఘటన వెలుగు చూసింది. ఏకంగా తన మలద్వారం నుంచి ఒక పాము కడుపులోకి దూరింది అంటూ ఒక పేషంట్ లబోదిబోమంటూ డాక్టర్లను ఆశ్రయించాడు. దీంతో వైద్యులు సైతం షాక్ అయ్యారు. హర్దోయ్ జిల్లాకు చెందిన మహేంద్రా అనే వ్యక్తి తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లాడు. ఏమైంది అని ప్రశ్నిస్తే బహిరంగ మలవిసర్జనకు వెళ్ళినప్పుడు ఇక మలద్వారం ద్వారా పాము కడుపులోకి వెళ్లిందని చెప్పాడు. దీంతో డాక్టర్లు షాక్ అయ్యి వెంటనే స్కానింగ్ తీయగా కడుపులో పాము లాంటిది ఏమీ లేదు అని తేలింది. డ్రగ్స్ వాడటం కారణంగానే అతనికి కడుపునొప్పి వచ్చిందని డాక్టర్లు గుర్తించారు. దీంతో మందులు రాసి అతన్ని ఇంటికి పంపించారు.