11 మంది భార్యలు వదిలేసారు.. చివరికి 12వ భార్యను?
ఎవరినైనా హత్య చేస్తే ఇక జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. దారుణమైన శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అన్న భయం ఎవరిలో కనిపించడం లేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కోపంలో విచక్షణ కోల్పోతున్న వారు చివరికి దారుణంగా హత్యలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఏకంగా సొంతవారి నుంచే ప్రాణహాని ఉంది అని ప్రతిక్షణం ప్రతి ఒక్కరు భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. జార్ఖండ్లో ఇలాంటి ఓ దారుణమే వెలుగు చూసింది అని చెప్పాలి. ఏకంగా 12వ భార్యని దారుణంగా హత్య చేశాడు రామచంద్ర అనే ఒక కిరాతకుడు.
అతనికి అప్పటికే 11 సార్లు పెళ్లి జరిగింది. కానీ అతని వేధింపులు తట్టుకోలేక 11 మంది భార్యలు కూడా అతని వదిలేసి వెళ్లిపోయారు. ఇక అంతటితో ఆగకుండా అతడు 12వసారి పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత కూడా తీరు మార్చుకోకుండా తరచూ భార్యతో గొడవ పడుతూనే ఉండేవాడు. ఇక ఇటీవలే తన భార్య సావిత్రితో రామచంద్ర మరోసారి మద్యం మత్తులో గొడవపడ్డాడు. ఇక మాటా మాటా పెరగడంతో కోపంతో ఊగిపోయిన రామచంద్ర దారుణంగా ఆమెను కొట్టి చంపాడు. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.