రైలెక్కి సెల్ఫీ తీసుకున్నాడు.. కానీ క్షణాల్లో మృత్యువు కబళించింది?

praveen
నేటి రోజుల్లో యువత మొత్తం సెల్ఫీ మోజులోనే మునికి తేలుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరికి ఎంతో అధునాతన టెక్నాలజీతో కూడిన స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడం... ఇక ఇంటర్నెట్ వాడకం కూడా పెరిగిపోవడంతో ఇక ఇలా  ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా కూడా ఒక సెల్ఫీ తీసుకోవడం దానిని సోషల్ మీడియాలో పెట్టి ఇక వచ్చిన లైకులు షేర్లతో ఎంతగానో ఆనంద పడిపోవడం లాంటివి చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే ఇలా సోషల్ మీడియా లైకుల ఊబిలో కూరుకుపోయి కొన్ని కొన్ని సార్లు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి.

 సెల్ఫీ మీద ఉన్న పిచ్చి కారణంగా కొంతమంది ఏకంగా ప్రమాదం ఉందని తెలిసినా కూడా చివరికి ప్రాణాలను ఫణంగా పెట్టి ఫోటో తీసుకునేందుకు ప్రయత్నించి చివరికి చేజేతులారా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ సెల్ఫీ పిచ్చి మరొకరి ప్రాణం బలి కావడానికి కారణమైంది అని చెప్పాలి. ఏకంగా రైల్లో ప్రయాణిస్తున్న యువకుడు సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించి చివరికి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఒడిశాలోని రాయగడ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

 ఏకంగా రైలు పైకి ఎక్కి యువకుడు సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా.. విద్యుత్ తీగలు తగిలి అతను ప్రాణాలు కోల్పోయాడు. ఆగి ఉన్న రైలు ఎక్కాడు సుదీర్  అనే యువకుడు. కేసింగ్ పూర్ సమితిలోని ఓల్డ్ మస్కా స్టేషన్ సమీపంలో ఒక గూడ్స్ రైలు ఆగి ఉండగా రైలు పైకి ఎక్కి సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పెట్టాలని అనుకున్నాడు.  కానీ అక్కడే అతని కోసం మృత్యువు వేచి చూస్తుంది అని మాత్రం ఊహించలేకపోయాడు. రైలు మీదకి ఎక్కి సెల్ఫీ తీసుకుంటుండగా విద్యుత్ లైన్లు తగిలి క్షణాల వ్యవధిలో మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: