హాస్పిటల్లో పెళ్లి చేసుకున్నారు.. ఎందుకో తెలుసా?

praveen
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది అని చెప్పాలి. ఎందుకంటే ఇక పెళ్లీడుకు వచ్చిన వారందరూ కూడా తమ పెళ్లి గురించి పెళ్లి తర్వాత జీవితం గురించి కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. ఇక తమకు నచ్చిన భాగస్వామి దొరికితే జీవితాంతం సంతోషంగా ఉండవచ్చు అని ఆశపడుతూ ఉంటారు అని చెప్పాలీ. అదే సమయంలో ఇక పెళ్లి వేడుకను కూడా ఇక జీవితాంతం గుర్తుండిపోయే విధంగా ఎంతో ప్రత్యేకంగా జరుపుకోవాలనిభావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక డబ్బులు లేకపోయినా తాహతకు మించి పెళ్లి కోసం డబ్బులు ఖర్చు పెడుతున్న వారిని కూడా నేటి రోజుల్లో చూస్తూ ఉన్నాం.

 అయితే ఇటీవల కాలంలో ఇలా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయబడిన పెళ్లి మండపంలో ఇక వధూవరులు ఇద్దరు కూడా సాంప్రదాయ వస్త్రధారణలో ఏకంగా నృత్యం చేసుకుంటూ మండపంలోకి రావడం ఇక ఎంతో ఘనంగా బంధుమిత్రులు సమక్షంలో పెళ్లిళ్లు చేసుకోవడం లాంటి వీడియోలు ఇక సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతున్నాయి అని చెప్పాలి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకునే పెళ్లి మాత్రం కాస్త కొత్తగా జరిగింది. ఇక్కడ నూతన వధూవరులకు హాస్పిటల్ పెళ్లి వేదికగా మారిపోయింది అని చెప్పాలి.

 ఇక బంధు మిత్రులందరికీ కూడా అటు హాస్పిటల్లోకే వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. హాస్పిటల్లో పెళ్లి చేసుకోవడం ఏంటి.. ఇంతకీ ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఆత్రుతగా ఉన్నారు కదా. రాజస్థాన్లోని బావ్ పురాకు చెందిన పంకజ్ అనే యువతికి మధు అనే వ్యక్తితో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే వధువు మెట్ల మీద నుంచి జారిపడి హాస్పిటల్లో చేరింది. దీంతో ఇరు కుటుంబాలు చర్చించుకుని హాస్పిటల్ లోనే పెళ్లి చేయాలనే నిర్ణయించారు. ఈ క్రమంలోనే హాస్పిటల్లో ఒక రూమ్ ని పెళ్లి వేదిక లాగా ముస్తాబు చేయగా ఊరేగింపుగా.. వచ్చిన వరుడు ఇక హాస్పిటల్ లోనే వధువుకు తాళి కట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: