పీజీ విద్యార్థినిపై ప్రిన్సిపాల్ కన్ను.. చివరికి ఓ రోజు?

praveen
ఉపాధ్యాయులు అంటే దైవ సమానులు అని అందరూ చెబుతూ ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు కేవలం పిల్లలకు జన్మనిస్తే.. ఇక ఆ జీవితానికి సరైన మార్గాన్ని చూపించేది వెలుగునిచ్చేది మాత్రం ఉపాధ్యాయులే అని చెప్పాలి. అందుకే ఇక ఈ లోకంలో తల్లిదండ్రుల తర్వాత దైవం గురువే అని అంటూ ఉంటారు.  కానీ ఇటీవల కాలంలో మాత్రం ఇలా దైవ సమానులైన గురువులే విద్యార్థుల పట్ల నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్న తీరు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తూ ఉన్నాయి.

 విద్యాబుద్ధులు నేర్పించి ఇక తమ దగ్గర చదువుకుంటున్న అందరిని కూడా సన్మార్గంలో నడిపించాల్సిన వారు వక్ర బుద్ధితో ఆలోచిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే తమ విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాల్సింది పోయి ఏకంగా వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయ్. ఇక  తమిళనాడులో కూడా ఇలాంటి ఘటన జరిగింది. పీజీ చదువుతున్న విద్యార్థినిపై కన్నేసిన ప్రిన్సిపల్ ఆమెకు ఫోన్ చేసి ఇంటికి రమ్మంటూ పిలిచాడు. ఇందుకు సంబంధించిన రికార్డింగ్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.

 చెన్నైలోని నందనం లో ఉన్న వైఎంసీఏ కాలేజ్ లో వందల మంది విద్యార్థులు విద్యార్థులు ఇంటర్ నుంచి పిజి వరకు చదువుకుంటున్నారు. అయితే జార్జ్ అబ్రహం అనే వ్యక్తి ప్రిన్సిపాల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇక అదే కాలేజీలో చదువుతున్న 22 ఏళ్ళ పిజి విద్యార్థినిపై అతని కన్ను పడింది. తరచూ ఆమెకు ఫోన్ చేయడం వాట్స్అప్ మెసేజ్లు పెట్టడం చేసేవాడు.  ఇక ఒకసారి యువతీకి నేరుగా ఫోన్ తనతో గడపాలని ఇంటికి రావాలి అంటూ నోటికొచ్చింది మాట్లాడాడు. అయితే సదరు యువతీ ఇదంతా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారిపోయింది. ప్రిన్సిపల్ అలా అనడంతో మీరు నన్ను ఏ పని కోసం పిలుస్తున్నారో నాకు అర్థమైంది అంటూ ప్రిన్సిపల్ తీరుపై యువతి అసహనం వ్యక్తం చేసింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: