పిల్లలు కనేందుకు ఒప్పుకోని భర్త.. భార్య ఏం చేసిందంటే?

praveen
పెళ్లయిన ప్రతి మహిళ కూడా అమ్మతనాన్ని కోరుకుంటుంది. ఇక అమ్మ అవడంతోనే స్త్రీగా పుట్టినందుకు తన జన్మకు ఒక అర్థం ఉంటుందని ఎంతోమంది మహిళలు కూడా భావిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఇలా పెళ్లి తర్వాత పిల్లలను కనడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. మరి కొంతమంది పిల్లలను కనడం కాదు వారికి మంచి భవిష్యత్తును అందించాలి అనే ఉద్దేశంతో ఇక కాస్త సెటిల్ అయిన తర్వాత పిల్లలను కనడానికి ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పాలి.

 అయితే ఇక్కడొక యువతి కూడా ఇలాగే అమ్మతనాన్ని కోరుకుంది. ఆమెకు పెళ్లయి నాలుగు నెలలు అవుతుంది. అయితే పిల్లలు కావాలని ఆమె కోరుకున్నప్పటికీ భర్త మాత్రం ఇప్పుడే వద్దు అని చెప్పేశాడు. కొన్ని రోజుల వరకు ఆగుదాం అంటూ సర్ది చెప్పుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఎన్నో రోజులపాటు వేచి చూసిన యువతీ చివరికి భర్త పిల్లలను కనేందుకు అంగీకరించడేమో అని భయంతో మనస్థాపం చెందింది. ఈ క్రమంలోనే షాకింగ్ నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.

 మలాని కాలనీకి చెందిన విజయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పాలురు మండలం నుచూపొద్దు గ్రామానికి చెందిన విజయలక్ష్మితో నాలుగు నెలల క్రితం జరిగింది. అయితే ఇద్దరు బోయిన్ పల్లిలో నివాసం ఉంటున్నారు. విజయలక్ష్మీ తనని పిల్లలు కావాలని భర్తతో తరచూ చెబుతూ ఉండేది. భర్త మాత్రం ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఇప్పుడే పిల్లలు వద్దు కాస్త సెటిల్ అయిన తర్వాత పిల్లల గురించి ఆలోచిద్దాం అంటూ చెప్పాడు. ఇక ఇదే విషయంపై తరచూ భార్యాభర్తలిద్దరి మధ్య వాదనలు జరుగుతూ ఉంటాయి. ఇటీవల ఇదే విషయంపై జరిగిన వాదనలు తీవ్ర రూపం దాల్చడంతో మనస్థాపానికి గురి అయిన విజయలక్ష్మి ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోయింది. బంధువులు సన్నిహితులను ఆరా తీసిన ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఇక మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: