సాంకేతిక లోపం.. ఏటీఎంలో నోట్ల వర్షం.. రూ.500 కొడితే?

praveen
ఇటీవల కాలంలో బ్యాంకు వినియోగదారులు ఎలాంటి ఆర్థికపరమైన లావాదేవిలు అయినా సరే అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లోనే చేసేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. కేవలం ఒకే ఒక క్లిక్ తో తమ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ ని మరొకరి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నారు. ఇలా నేటి రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా టెక్నాలజీని ఎంతగానో వినియోగించుకుంటున్నారు అని చెప్పాలి. అయితే ఇలా ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫర్ చేయడం మొబైల్లో కుదురుతుంది. కానీ నగదు కావాలి అంటే మాత్రం ప్రతి ఒక్కరు దగ్గరలో ఉన్న ఏటీఎంకు వెళ్లి క్యాష్ విత్ డ్రా చేసుకోవడం లాంటివి చేస్తున్నారు.

 అయితే ఇక ఇలా ఇటీవల కాలంలో ఏ ఏటీఎంలో చూసినా జనాలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నారు అని చెప్పాలి. అయితే ఏటీఎంలో  ఎంత నగదు కావాలని టైప్ చేస్తే అంతే నగదు విత్డ్రా  అవుతూ ఉంటుంది   కానీ కొన్ని కొన్ని సార్లు ఏటీఎంలో సాంకేతిక లోపం కారణంగా ఏకంగా నోట్లో వర్షం కురవడం లాంటి ఘటనలు ఇప్పటివరకు ఎన్నోసార్లు వెలుగులోకి  వచ్చాయి అన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో కూడా ఇలాంటి సీను రిపీట్ అయింది అని చెప్పాలి. ఇటీవల ఒక వినియోగదారునికి వింత అనుభవం ఎదురైంది అని చెప్పాలి.

 ముందుగా ఎంతగానో మోరాయించి ఇబ్బంది పెట్టిన ఏటీఎం ఆ తర్వాత మాత్రం నోట్ల వర్షం కురిపించింది అని చెప్పాలి. ఏకంగా 500 రూపాయలు డ్రా చేస్తే ఏటీఎం నుంచి 2500 రూపాయలు వచ్చాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఇక ఏటీఎం వద్దకు ఎగపడ్డారు అని చెప్పాలి. ఏటీఎం నుంచి తమకు కావలసినంత డబ్బు డ్రా చేసుకొని అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఎప్పుడూ లేనంతగా సదరు ఏటీఎం దగ్గర జనాలు ఎగబడటం చూసిన సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో వెంటనే బ్యాంకుకు సమాచారం అందించారు. పోలీసులతో పాటు బ్యాంకు సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి ఇక ఏటీఎంలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని పరిష్కరించారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Atm

సంబంధిత వార్తలు: