నీళ్లు అనుకుని డీజిల్ తాగిన బాలుడు.. చివరికి?
దీంతో పిల్లలు పుట్టారు అని ఆనందం ఆ తల్లిదండ్రులకు లేకుండా చేసి కడుపు కోతను మిగులుస్తుంది అని చెప్పాలి. ఇలా అనుకోని ఘటనల కారణంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు నేటి రోజుల్లో కోకోళ్లలుగా వెలుగులోకి వస్తున్నాయ్. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా దాహం వేయడంతో ప్లాస్టిక్ బాటిల్ లో ఉన్న డీజిల్‌ను నీరు అనుకుని తాగేశాడు తేడాదిన్నర వయస్సు ఉన్న బాబు. ఇక ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఊపిరాడకపోవడంతో తల్లిదండ్రులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చివరికి మృత్యువు ఒడిలోకి చేరాడు.
ఈ విషాదకర ఘటన ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఇటీవలే ఒక వ్యక్తి తన వాహనాన్ని రిపేర్ చేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో వాహనంలోని డీజిల్ తీసి ఒక బాటిల్ లో నింపాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఆడుకుంటున్న అతని కుమారుడైన ఏడాదిన్నర వయస్సున్న బాలుడు.. ఇక బాటిల్ లో ఉన్న డీజిల్‌ను నీరు అనుకుని తాగేసాడు. అనంతరం ఊపిరి అందక ఎంతగానో ఇబ్బంది పడ్డాడు. అయితే ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ముందుగా గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళగా ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్ళమని సలహా ఇచ్చారు వైద్యులు. అక్కడికి తీసుకు వెళ్లిన ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.