అయ్యో దేవుడా.. ముగ్గురు పిల్లల ఉసురు తీసిన రైలు?

praveen
మనిషి జీవితం క్షణకాలంలో ముగిసిపోయే ఒక చిన్న పుస్తకం అన్న విధంగా నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు మారిపోతున్నాయి. ఎందుకంటే ఎంతో సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు ఊహించని ఘటనలు ఎంతో మందిని మృత్యుఒడిలోకి నడుతూ ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఇలా ఊహించని ప్రమాదాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న సమయంలో ఎన్నో కుటుంబాలు అరణ్య రోదనలో మునిగిపోతూ ఉన్నారు. ముఖ్యంగా ఆభం శుభం తెలియని చిన్నారుల విషయంలో కూడా వీధి కన్ను కుట్టడంతో విషాదకరమైన ఘటనలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పాలి.

 ఇక ఇటీవలే పంజాబ్ లోని రూప్ నగర్ లో కూడా ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. ఏకంగా ఎంతోమందికి సౌకర్యవంతమైన ప్రయాణాలను అందించే ఒక రైలు చివరికి ముగ్గులు పిల్లల ఉసురు తీసుకుంది. ముగ్గురు చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో రైలు వేగంగా దూసుకు వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు చిన్నారులు. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు ఇక లేరు అన్న విషయాన్ని తట్టుకోలేకపోయిన తల్లిదండ్రులు అరణ్యరోధంగా విలపించారు అని చెప్పాలి. ఇక ఈ ఘటన అక్కడున్న వారందరినీ కూడా కంటతడి పెట్టించింది.

 కిరాక్పూర్ సాహిబ్ సమీపంలో ప్యాసింజర్ రైలు రోడ్డు దాటుతున్న ముగ్గురు పిల్లలపై నుంచి వెళ్లడంతో వారు అక్కడికక్కడే మరణించారు. అయితే పంజాబ్ రాష్ట్రంలోని సాటిలైజ్ నదిపై వంతెన సమీపంలో రైలు ట్రాక్ కు సమీపంలో నలుగురు వలస కూలీలకు పిల్లలు పట్టాలు దాటుతున్నారు. ఇంతలో అటువైపుగా ఓ రైలు దూసుకు వచ్చింది. అయితే ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మరణించగా మరో బాలుడికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. ఇక ఇలా మృతుల వయసు 7 నుంచి 11 సంవత్సరాల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: