అయ్యో దేవుడా.. పుట్టగొడుగులు ప్రాణాలు తీసాయే?

praveen
ఇటీవల కాలంలో మృత్యువు ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే  ప్రతి ఒక్కరు ప్రాణభయంతో ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకునేందుకు మంచి ఆహారాన్ని తీసుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు. తద్వారా ప్రాణాలను కాపాడుకోవాలి అని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంచి పోషకాలు ఉండే ఆకుకూరలతో పాటు మరికొన్ని రకాల కూరగాయలను తీసుకుంటే ఇక ఆరోగ్యానికి డోకా ఉండదు అని ఎంతో మంది భావిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ అలా అనుకొని ఒక ఆహారాన్ని తిని చివరికి ప్రాణాలు కోల్పోయాడు.

 మంచి పోషక విలువలు కలిగిన ఆహారాలలో అటు పుట్టగొడుగులు కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా పుట్టగొడుగులను కూరగా వండుకొని తినడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కానీ ఇలా పుట్టగొడుగులను తినడమే ఇక్కడ ఏకంగా ఒక కుటుంబంలో విషాదాన్ని నింపింది. విషపూరిత పుట్టగొడుగులను కూరగా వండుకొని తండ్రి కొడుకు మృతి చెందిన ఘటన దక్షిణ కన్నడ జిల్లా బెల్తంగడి తాలూకాలు వెలుగు చూసింది. చెరిమారుకు చెందిన గరువా మేట అనే 80 ఏళ్ల వ్యక్తి ఆయన కొడుకు వడియప్పా ఎంతో ఇష్టంగా పుట్టగొడుగుల కూర వండుకొని తిన్నారు.

 ఈ పుట్ట గొడుగులను అడవు ల్లోకి వెళ్లి ఏరుకొచ్చుకున్నారు అని చెప్పాలీ. రాత్రిపూట ఇంటిలో కూర చేసుకుని హాయిగా ఆరగించి నిద్రపోయారు. అయితే ఉదయం 10 గంటలు కావస్తున్న తండ్రి కొడుకులు ఇద్దరు నిద్రలేవలేదు. దీంతో పక్కింటి వారు వచ్చి చూడగా ప్రాణాలు పోయాయని గుర్తించారు. అయితే మరో కొడుకు ఇంట్లో లేకపోవడంతో చివరికి బ్రతికి బయటపడ్డాడు అని చెప్పాలి. ఈ ఘటన  పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికం గా సంచలనం  గా మారి పోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: