
షాకింగ్ మిస్టరీ : చంద్రగ్రహణం నుంచి ఇంట్లో మంటలు?
ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా చంద్రగ్రహణం సూర్యగ్రహణం లాంటి రోజును కీడుగా శంకిస్తూ ఉంటారు. ఆరోజు బయటికి వెళ్లకూడదని.. దుష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయని ఎంతోమంది పెద్దలు చెబుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో యువత ఇలాంటివి పెద్దగా పట్టించుకోక పోయినప్పటికీ పెద్దలు ఇప్పటికీ కూడా సూర్యగ్రహణం చంద్రగ్రహణం లాంటి రోజును కీడు రోజుగా భావిస్తూ ఇక ఎలాంటి కొత్త పనులు మొదలుపెట్టడం లాంటివి చేయరు. అయితే ఇటీవలే ఒక అంతుచిక్కని మిస్టరీ కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.
ఇక్కడ ఓ ఇంట్లో ఏకంగా అందరూ కీడు దినం అని భావించే చంద్రగ్రహణం నాటి నుంచి కూడా ఇక వరుసగా ప్రతిరోజు మంటలు చెలరేగుతూ ఉండడం సంచలనంగా మారిపోయింది. ఉత్తరాఖండ్లోని ఓ ఇంట్లో ఈ ఘటన వెలుగు చూసింది. గత ఎనిమిది రోజులుగా మంటలు చెలరేగుతున్నాయి అని చెప్పాలి. ఇంట్లో ఉన్న వస్తువులు అన్నీ కూడా మంటల్లో పడి కాలిపోతున్నాయట. విద్యుత్ ఆపేసిన కూడా ఇదే కొనసాగుతుంది ఈనెల 8వ తేదీన చంద్రగ్రహణంతో పాటు భూకంపం సంభవించిందని ఆ రోజు నుంచి ఇలాగే జరుగుతుందని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. ఇక ప్రతిరోజు రాత్రి మంటలు చలరేగుతున్నాయని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నాము అంటూ చెబుతూ ఉండడం గమనార్హం.