రౌడీ మహిళను వేధిస్తున్నాడని.. కుటుంబ సభ్యులు ఏం చేస్తారో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో మహిళలను వేధిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది.. ఇలాంటి సమయంలోనే ఎవరైనా మహిళలను వేధిస్తున్నారు అంటే స్థానికులు కూడా చూసి చూడనట్లు ఊరుకోవడం లేదు. ఏకంగా ఇలా ఆకతాయిలకు దేహశుద్ధి చేసి చివరికి పోలీసులకు అప్పచెప్పుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ కొంతమంది అయితే మరింత రెచ్చిపోయి ఏకంగా మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారు అనే కారణంతో ప్రాణాలు తీస్తున్న ఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి. హర్యానా లో మహిళను వేధింపులకు పాల్పడుతున్నారని కారణంతో ఒక వ్యక్తిని కొట్టి చంపారు కుటుంబ సభ్యులు.


 గురుగ్రమ్ జిల్లాలోని ఫరీదాబాద్ గ్రామంలో 32 ఏళ్ల వ్యక్తిని ఓ మహిళ కుటుంబం దారుణంగా కొట్టి చంపారు. అతని స్నేహితుడి పై కూడా కర్రలు ఇనుపరాట్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ అతను ప్రస్తుతం ఆస్పత్రిలో కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.. మోహిత్ అతని స్నేహితుడు నవీన్ కారులో తాగుతుండగా భూపానిలో 28 ఏళ్ల యువతి కుటుంబ సభ్యులు బంధువులు వారిని చుట్టుముట్టి దారుణంగా కర్రలు రాళ్లతో దాడి చేశారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునేంతవరకు కూడా ఆ ఇద్దరినీ దారుణంగా కొడుతూనే ఉన్నారు. ఇక ఆ తర్వాత  వేధింపులకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు మహిళ సహా ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కు వెళ్లారు.


 వేధింపులకు పాల్పడటమే కాక పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఇక బాధిత కుటుంబం పోలీస్ ఫిర్యాదులో పేర్కొంది. అయితే మోహిత్ కు గతంలోనే నేర చరిత్ర ఉందని అతనిపై అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయని పోలీసులు కూడా గుర్తించారు. అదే సమయంలో ఇక మోహిత్ సహా తన స్నేహితుని కొట్టిన మహిళా కుటుంబ సభ్యులు నలుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఇందులో ఒకరు పరారీలో ఉండగా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: