పెళ్లయిన మరునాడే వరుడికి షాక్.. వధువు అలా చేయడంతో?
ఇటీవల కాలంలో అయితే పెళ్లిని మరింత ప్రత్యేకంగా మార్చుకునేందుకు భారీగా ఖర్చు పెట్టి మరి ఇక ఎంతోమంది వధూవరులు కాస్త వినూత్నంగా పెళ్లి చేసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవలే కాలంలో పెళ్లి అనేది ఒక కమర్షియల్ ఎలిమెంట్ గా మారిపోయింది. ఎంతోమంది పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. పెళ్లి చేసుకున్నట్లుగా మాయ చేసి ఇక మాటలతో నమ్మించి చివరికి నట్టేట ముంచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. పెళ్లి సంబంధాలు చూస్తున్న యువకుడికి మంచి అమ్మాయితో పెళ్లి చేస్తామని ఇద్దరు యువకులు నమ్మించారు. ఈ క్రమంలోనే పెళ్లి కూడా చేశారు. కానీ ఆ తర్వాతే అసలు విషయం బయటపడి అతను ఒక్కసారిగా అవాక్కయ్యాడు.
తనకు జరిగింది పెళ్లి కాదు అదంతా మోసం అనే విషయాన్ని గ్రహించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో వెలుగులోకి వచ్చింది. ఎన్నో రోజుల నుంచి పెళ్లి కోసం ఎదురుచూస్తున్న జయదేవపూర్ కు చెందిన అరవింద్ ను ఇద్దరు వ్యక్తులు కలిశారు. మంచి అమ్మాయితో పెళ్లి చేస్తాము అంటూ మాయమాటలతో నమ్మించారు. ఇక సెప్టెంబర్ 30వ తేదీన ఒక అమ్మాయి ఫోటో చూపించగా అతడికి నచ్చింది ఇక అక్టోబర్ 1వ తేదీన పెళ్లి చేశారు. భార్యను ఇంటికి తీసుకురాగా.. ఉదయం లేచి చూసేసరికి భార్య కనిపించలేదు. ఏంటా అని చెక్ చేస్తే ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు బంగారు ఆభరణాలు కూడా కనిపించకుండా పోయాయ్. దీంతో వెంటనే అరవిందు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.