పుట్టింటికి వెళ్లిన భార్య.. భర్త చేసిన పనికి అందరూ షాక్?
ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఆ సమస్యకు ఆత్మహత్య ఒక్కటే పరిష్కారం అన్న విధంగా నేటి రోజుల్లో జనాలు వ్యవహరిస్తూ ఉన్నారు. దీంతో చిన్నచిన్న కారణాలకి ఆత్మహత్యలు చేసుకుంటూ బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య తలెత్తుతున్న చిన్నపాటి గొడవలే ఇలా ఆత్మహత్యలు చేసుకునే అంతవరకు వెళుతూ ఉన్నాయి. ఇక ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలంలో భార్య పుట్టింటికి వెళ్ళింది అనే కారణంతో ఒక వ్యక్తి చివరికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి. కోలపల్లికి చెందిన పూల బోయిన రమేష్ అనే 40 ఏళ్ల వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో రమేష్ భార్య కొద్ది రోజుల క్రితం వట్టిపల్లి మండలం బిజిలి పూర్ లో ఉండే పుట్టింటికి వెళ్ళింది. అయితే ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో రమేష్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. చివరికి ఆదివారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు అని చెప్పాలి. ఇక తండ్రి కిష్టయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.