సగం గడ్డం గీసాక డబ్బులు అడిగాడు.. చివరికి దారుణం?

praveen
ఇటీవలి కాలంలో మనుషుల్లో మానవత్వం అనేది పూర్తిగా కనుమరుగై పోతుంది . ఈ క్రమంలోనే సాటి మనుషుల విషయంలో కాస్త అయినా జాలి దయ చూపించడం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి అని చెప్పాలి. చిన్నచిన్న కారణాలకే ఏకంగా సాటి మనుషుల విషయంలో కాస్త అయినా జాలి చూపించనీ జనాలు హత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో తెలుగు లోకి వస్తున్నాయి. ఒక మనిషి ప్రాణాలు తీయడం నేరమని.. అలాంటి నేరానికి పాల్పడి జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని అందరికీ తెలుసు.


 కానీ ఎవరూ మనుషుల ప్రాణాలు తీయడానికి మాత్రం వెనకడుగు వేయడం లేదు అని చెప్పాలి. ఇటీవలి కాలంలో చిన్నచిన్న కారణాలకే ప్రాణాలు తీస్తూ వుండగా ఇలా హత్యలకు గల కారణాల గురించి తెలిసి ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఇటీవల కాలంలో ఎవరైనా సరే తలపై జుట్టు కత్తిరించు కోడానికి లేదా గడ్డం తీయించుకోవడానికి సెలూన్ వెళుతూ ఉంటారు.  అక్కడ డబ్బులు చెల్లించి ఇక కటింగ్ చేయించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.


 ఇక ఇదే విషయంలో ఇటీవల ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. మహారాష్ట్రలోని బోధి లో అనిల్ సిందే కు చెందిన సెలూన్ కు వెంకట్ దేవ్ కర్  అనే వ్యక్తి సేవింగ్ చేసుకోడానికి వెళ్ళాడు.  సగం గడ్డం తీసిన తర్వాత వెంకట్ ను అనిల్ డబ్బులు అడిగాడు. అయితే షేవింగ్ పూర్తయిన తర్వాత ఇస్తాను అని చెప్పినప్పటికీ  అనిల్ మాత్రం వినలేదు.  ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.  దీంతో కోపంతో ఊగిపోయిన అనిల్ షేవింగ్ చేసే కత్తితో వెంకట్ గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. విషయం తెలుసుకున్న వెంకట్ బంధువులు అటు అనిల్ పై దాడి చేయడమే కాదు షాప్కి నిప్పంటించారు. అనిల్ ను దారుణంగా  చితకబాదడంతో అతను చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: