మొబైల్ దిండు కింద పెట్టుకొని పడుకుంది.. చివరికి ప్రాణం పోయింది?
ఇలా ఆరంగుళాల మొబైల్ ఆరడుగుల మనిషి అవసరాలను పూర్తి గా తీర్చుతూ చివరికి మొబైల్ కు బానిసగా మార్చుకుంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. అంతేకాదు మొబైల్ ఎంతోమంది ప్రాణాలు పోవడానికి కారణం అవుతుంది అని చెప్పాలి. నిమిషం పాటు కూడా మొబైల్ వాడకుండా ఉండలేకపోతున్నారు జనాలు. చివరికి ఛార్జింగ్ పెట్టి కూడా నిర్లక్ష్యంగా ఫోన్ వాడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. తద్వారా మొబైల్ పేలి ఎంతో మంది గాయాల బారిన పడుతూ ఉంటే ఇంకెంతో మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. మొబైల్ ఫోన్ పక్కన పెట్టుకొని నిద్ర పోయిన ఒక మహిళ నిద్రలోనే చివరికి ప్రాణాలు విడిచింది. ఢిల్లీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. రెడ్మి 6a మొబైల్ లో కాసేపు మాట్లాడిన తర్వాత బెడ్ మీద పెట్టి నిద్రలోకి జారుకుంది సదరు మహిళ. అయితే కాసేపటికే ఆ మొబైల్ ఒక్కసారిగా పేలి పోవడం గమనార్హం.. మొబైల్ పేలినట్లు దిండు మీదే ఆ మహిళ నిద్ర పడిపోవడంతో ఇక తలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో చివరికి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది . ఈ విషయాన్ని మృతురాలి బంధువులు సోషల్ మీడియా వేదికగా చెప్పడంతో హాట్ టాపిక్ గా మారింది అని చెప్పాలి.