జొమాటోలో బిర్యానీ ఆర్డర్ చేశాడు.. కానీ ఏం వచ్చిందో తెలుసా?

praveen
ఒకప్పుడు ఆహారం తినాలనిపిస్తే ఇంట్లో వండుకునే వాళ్ళం.. అంత ఓపిక లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం.. ఇప్పుడు అంత కష్టపడాల్సిన పని లేకుండా పోయింది. ఇంటి పక్కనే  రెస్టారెంట్ ఉన్నా ఎందుకో అర చేతిలో ఉన్న ఫుడ్ డెలివరీ యాప్ లోనే ఆర్డర్ లు పెడుతున్నారు ఎక్కువ మంది. ఇక ఈ ఫుడ్ డెలివరీ యాప్ లకు బాగా అలవాటు పడిపోయారు అనే చెప్పాలి. దీంతో ఏదైనా తినాలనిపించింది అంటే చాలు వెంటనే మొబైల్ ఓపెన్ చేయడం అందులో ఫుడ్ డెలివరీ యాప్ ఓపెన్ చేసి ఆర్డర్ పెట్టడం చేస్తున్నారు. నిమిషాల వ్యవధిలోనే కావాల్సిన ఫుడ్ కళ్ళముందు వాలిపోతూ ఉంది అని చెప్పాలి.


 ఇలా ఫుడ్ డెలివరీ యాప్స్ లో ప్రస్తుతం జొమాటో ముందు స్థానంలో ఉంది అని చెప్పాలి. ఇక ఈ యాప్ సేవలకు భోజనప్రియులు నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అదే సమయంలో కొంతమంది కస్టమర్లకు చేదు అనుభవాలు కూడా ఎదురవుతున్నాయ్. ఇటీవలే ఒక వ్యక్తికి ఇలాంటిదే జరిగింది. గురుగ్రామ్ కు చెందిన వ్యక్తి హైదరాబాద్ బిర్యానీ కోసం జోమటో ఆర్డర్ చేశాడు. కానీ జొమాటో మాత్రం కేవలం సాలన్ మాత్రమే డెలివరీ చేసింది. అయితే ఆ వ్యక్తి జొమాటో వాటాదారు డే కావడం గమనార్హం.


 గురు గ్రామ్ కు చెందిన ప్రతీక్ కన్వాల్ అనే వ్యక్తి ఇటీవల జొమాటో ఇంటర్సిటీ లెజెండ్ సేవలను ప్రయత్నించాడు. హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్ నుండి చికెన్ బిర్యాని ఆర్డర్ చేశాడు. అయితే జొమాటో ఆయనకు బిర్యానీ కి బదులుగా దానికి సైడ్ దిశగా ఇచ్చే సాలన్ మాత్రమే డెలివరీ చేసింది. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు సదరు వ్యక్తి. ఇక ఈ విషయం తెలిసిన వాళ్ళు అందరూ కూడా అవాక్కవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: