స్నేహితుడే కదా అని.. ఇంటికి రాణిస్తే.. ఛీ ఛీ?
ఎందుకంటే స్నేహితుడికి ఎంతో నమ్మకంగా ఉండాల్సిన వారు చివరికి స్నేహితుడి ఇంట్లో వారితోనే అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ వెన్నుపోటు పొడుస్తున్నారు. కాగా అక్రమ సంబంధానికి అడ్డు వచ్చిన స్నేహితుడిని హత మార్చేందుకు కూడా సిద్ధమవుతున్న ఘటనలు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఉలిక్కిపడ్డ వలసిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. అక్రమ సంబంధాల కారణంగా నేటి రోజుల్లో ఎన్నో దారుణ ఘటనలు జరిగి పోతున్నాయి క్షణకాల సుఖం కోసం మానవ బంధాలను మరిచిపోతున్నారు మనుషులు. ఏపీ లోని చిత్తూరు జిల్లా నగరి లో కూడా ఇలాంటి దారుణ ఘటన జరిగింది.
ఇందిరా నగర్ లో విజయ్ అనిత అనే భార్య భర్తలు ఉంటున్నారు. అయితే విజయ్ కి తమిళ అరసు అనే ఒక స్నేహితుడు కూడా ఉన్నాడు. స్నేహితుడు కావడంతో ఆ విజయ్ ఇంటికి వస్తూ ఉండేవాడు అతను. నమ్మకం గా ఉండాల్సిన సదరు యువకుడు విజయ్ భార్యతో పరిచయం పెంచుకుని అక్రమ సంబంధానికి తెరలేపాడు. విజయ్ కు తెలియకుండా ఇద్దరు ఎప్పుడూ ఏకాంతంగా కలుస్తూ ఉండేవారు. ఓ రోజు వారు ఏకాంతంగా ఉన్న సమయంలో విజయ్ కంట పడ్డారు. తీరు మార్చుకోవాలని అటు ఇటు స్నేహితుడిని భార్యను కూడా హెచ్చరించాడు విజయ్. కానీ తమ ఏఫైర్ కొనసాగాలంటే విజయ్ ని చంపాలని ఇద్దరూ ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ ప్రకారం చంపి ప్రమాదవాశాత్తు చనిపోయినట్లు చూపించారు. కానీ పోలీసుల దర్యాప్తులో మాత్రం అసలు విషయం వెలుగులోకి వచ్చింది.