తండ్రికి అంత్యక్రియలు.. కానీ వారంరోజుల తర్వాత?

praveen
సాధారణంగా కుటుంబంలో ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు శోకతప్త హృదయాలతో అంత్యక్రియలు నిర్వహించడం లాంటివి చేస్తూ ఉంటారు.  ఈ క్రమంలోనే సాంప్రదాయం ప్రకారం అన్ని కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. ఇక కొన్నాళ్లపాటు చనిపోయిన వ్యక్తి గురించి బాధపడి తర్వాత మర్చిపోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇలా చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించి ఈ కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత సదరు వ్యక్తి మళ్లీ ఇంటికి తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి సినిమాలో జరుగుతాయి కాని నిజ జీవితంలో చాలా కష్టం అంటారు ఎవరైనా.


 కానీ ఇటీవలి కాలంలో ఇలాంటి తరహా ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇంతకీ ఇలాంటి ఘటనలు జరగడానికి కారణం ఏంటో తెలుసా కుటుంబసభ్యుల పొరపాటు. రోడ్డు ప్రమాదాల్లో ఎవరో చనిపోతే ఇక పొరపాటున మన కుటుంబ సభ్యులే  అనుకొని చివరికి ఆ డెడ్ బాడీ కి అంత్యక్రియలు నిర్వహించడం లాంటివి చేస్తూ ఉంటారు.  కొన్ని సార్లు ఆసుపత్రిలో ఒకరి శవానికి బదులు మరొకరి శవం  ఇవ్వడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇటీవలే ఉత్తరప్రదేశ్లోని లఖిమ్ పూర్ ఖేరి  లో ఇలాంటి ఒక ఆశ్చర్యకరమైన జరిగింది.


 స్థానికంగా ఉండే ఇంద్ర కుమార్ అనే వ్యక్తి తన తండ్రి రాణా లాల్  కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఎన్నో రోజుల పాటు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టిన ఆచూకీ లభించలేదు.   కానీ ఇటీవలే ఒక అనాధ శవం పోలీసులకు లభించింది.. ఇంద్ర కుమార్ తండ్రి పోలికలను కలిగి ఉంది.  దీంతో చనిపోయింది తమ తండ్రి అనుకుని ఇంటికి తీసుకువచ్చారు. సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. కానీ కొన్ని రోజుల తర్వాత అతనికి ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చింది. మీ  తండ్రి కాలికి గాయమై అపస్మారక  స్థితిలో ఉన్నాడు అంటూ డాక్టర్ల ఫోన్ చేయడంతో హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లగా కళ్ళముందు తండ్రిని చూసి నమ్మలేకపోయాడు. జరిగిన పొరపాటు  అర్థం చేసుకొని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: