సొంత కూతుర్ని చంపిన తండ్రి.. కారణం తెలిస్తే మాత్రం అవాక్కవుతారు?
చిన్న చిన్న కారణాలకే ఉన్మాదులు గా మారి పోతున్న మనుషులు చివరికి దారుణం గా హత్య చేయడానికి కూడా సిద్ధమై పోతున్నారు. ఏకంగా రక్తం పంచుకుని పుట్టిన వారి ప్రాణాలను కూడా గాల్లో కలీపేస్తున్నారు. ఇలాంటి ఘటనలు సభ్యసమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఉత్తరప్రదేశ్లోని హపూర్ జిల్లాలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది. బాబుగడ్ ప్రాంతానికి చెందిన 55 ఏళ్ల మహమ్మద్ ఫరియాద్ కు ఆరుగురు సంతానం.
ఇకపోతే ఇటీవల పనికి వెళ్లి ఇంటికి వచ్చిన మహమ్మద్ ఫరియాద్ రెండో కుమార్తె రేష్మనీ ఆహారం పెట్టమని అడిగాడు. అయితే రేష్మ ఏదో పనిలో బిజీగా ఉండడంతో అతనికి ఆహారం పెట్టడం కాస్త ఆలస్యం అయింది. ఈ క్రమంలోనే కుమార్తెను దారుణంగా తిట్టాడు. దీంతో రేష్మా కూడా కాస్త ఘాటుగానే బదులిచ్చింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయాడు మహ్మద్ ఫరియద్ గడ్డి కత్తిరించే బ్లేడుతో ఆమెపై దాడికి దిగాడు. తీవ్రంగా గాయపరిచాడు. దీంతో రక్తపు మడుగులో కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతు అక్కడే ప్రాణాలు వదిలింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.