నీటి కుండ ముట్టుకున్నాడని.. దళిత విద్యార్థిని చంపేసిన టీచర్?

praveen
ఒకప్పుడు దళితులపై ఎంతలా వివక్ష కొనసాగేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దళితులను కనీసం మనుషుల్లా కూడా చూసేవారు కాదు. దళితులు ఏ వస్తువు ముట్టుకున్న కూడా అపవిత్రం అయిపోయింది అని భావించేవారు. కానీ నేటి సమాజంలో మాత్రం ఇలాంటి వివక్ష దాదాపు తగ్గిపోయింది అని చెప్పాలి. దళితులు ఉన్నత వర్గాలు అనే తేడా లేకుండా అందరూ సమానమే అనే ధోరణి కొనసాగుతోంది. ఇలాంటి ఆధునిక సమాజంలో కూడా ఇటీవలి కాలంలో దళితుల పట్ల వివక్ష కనుమరుగు అవ్వలేదు అన్న దానికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. కుండలో ఉన్న నీరు తాగడానికి దాని ముట్టుకున్నాడు అన్న కారణంతో ఓ దళిత విద్యార్థిని దారుణంగా కొట్టాడు ఒక టీచర్. కేవలం ఆ కుండలో నీళ్లు అగ్ర వర్గాల కోసం మాత్రమే..  దాన్ని ఎందుకు ముట్టుకున్నావు అంటూ తిడుతూ దారుణంగా చితకబాదాడు. చివరకు తీవ్ర గాయాలపాలైన ఆ విద్యార్థి చికిత్స పొందుతూ చివరికి ప్రాణాలు వదిలాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్లోని జాలోర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. సూరన గ్రామంలో చోటు చేసుకుంది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 సూరన గ్రామంలో ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న 9 ఏళ్ల బాలుడు ఇటీవలే దాహం వేయడంతో ఇక క్లాస్ పక్కనే ఉన్న కుండలో నీళ్లు తాగాలి అని భావించాడు. అయితే కేవలం అగ్రవర్ణ కులాల పిల్లలు మాత్రమే తాగేందుకు ఆ కుండ ఏర్పాటు చేశారట. కానీ ఈ విషయం బాలుడికి తెలియదు. దీంతో నీరు తాగేందుకు ఆ కుండను ముట్టుకున్నాడు. ఇంకేముంది అతనిపై టీచర్ కోపంతో ఊగిపోయాడు. ఆ కుండను ఎందుకు ముట్టుకుంటావు  అంటూ తీవ్రంగా కొట్టాడు. తర్వాత వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడు మృతి పై రాజస్థాన్ ప్రభుత్వం 5లక్షల పరిహారం ప్రకటించింది. ఇలాంటి చర్యను ఖండిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: