వెరైటీ దొంగ.. అదొక్కటే చోరీ చేస్తాడు?

praveen
కొందరు దొంగల తీరు ఆశ్చర్యకరం గా ఉంటుంది. కళ్ల ముందు బంగారం ఉన్నా, డబ్బులు కట్టలు కట్టలుగా ఉన్నా కొందరు అవి ముట్టుకోరు. అందరూ ఊహించని రీతిలో తమకు కావాల్సింది తీసుకుని అక్కడి నుంచి జారుకుంటుంటారు. ఇటీవల కొన్ని దొంగతనాలను చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాద్‌ లో రెండు నెలల క్రితం ఎవరూ లేనప్పుడు ఓ దొంగ ఇంట్లో చొరబడ్డాడు. బీరువా లో బంగారం, డబ్బు తీసుకోకుండా కేవలం దుస్తులు మాత్రమే మాయం చేశాడు. అది చూసి పోలీసులు సైతం ముక్కున వేలేసుకున్నారు. ఇక ఇదే తరహాలో కొందరు దొంగల శైలి చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఇటీవల నిజామాబాద్ పోలీసులకు కొత్త చిక్కు వచ్చి పడింది. పలువురు బాధితులు ఒక్కొక్కరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమ కారు సైలెన్సర్ దొంగతనానికి గురైందని కంప్లైంట్ ఇచ్చారు. కారును వదిలేసి కేవలం సైలెన్సర్ ఎత్తుకు పోవడం ఏంటని మొదట్లో పోలీసులు ఆశ్చర్య పడ్డారు. ఆ తర్వాత కేసులు నమోదు చేసుకుని ఆ వెరైటీ దొంగల కోసం గాలింపు చేపట్టారు. చివరికి ఎట్టకేలకు వలపన్ని ఆ దొంగలను పట్టుకున్నారు. విచారణలో వారికి షాకింగ్ విషయాలు తెలిశాయి. తాము కేవలం సైలెన్సర్‌లను మాత్రమే ఎందుకు దొంగతనం చేశారో వారు చెప్పారు. యూపీలోని బులంద్ సహారా జిల్లాకు చెందిన వసీం, సోహెల్, జాకీ ఈ వింత దొంగతనాలు చేశారు. ఇటీవల మార్కెట్‌లోకి బీఎస్-6 నిబంధనలను అనుసరించి మారుతి ఈకో వాహనాలను విడుదల చేసింది. ఆ కార్ల సైలెన్సర్‌లను ప్లాటినం, రోడియం, పెలాడియం వంటి లోహాలతో తయారు చేశారు. వాటి విలువ మార్కెట్‌లో రూ.80 వేలు ఉంటుంది. దీంతో ఆ ముగ్గురు కలిసి హైదరాబాద్, కామారెడ్డి, నిజామాబాద్‌లలో పలు కార్లకు ఉన్న సైలెన్సర్‌లను మాయం చేశారు. చివరికి వారిని నిజామాబాద్ పోలీసులు పట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: