ప్రేమ అంటూ చెప్పాడు.. కానీ చివరికి?
ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఎన్ని దారుణమైన శిక్షలు విధించినా ఎందుకో కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడంలేదు. దీంతో ఆడపిల్ల ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే భయపడే పరిస్థితి వస్తుంది. అయితే ఇటీవలి కాలంలో ఆడపిల్లలపై బలవంతంగా అత్యాచారాలు చేస్తున్న వారి కంటే.. మంచి వాళ్ళలా నటించి సమయం సందర్భం కోసంవేచి చూసి ఇక మాయమాటలతో లోబర్చుకుని అత్యాచారాలు చేస్తున్న వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఒక ఎంతో మంది కామాంధులకు ప్రేమ అనేది అవసరాలు తీసుకునే ఒక ఆయుధంగా మారిపోయింది అని చెప్పాలి.
ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పిన యువకుడు చివరికి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో నాలుగు రోజుల కిందట మాయమాటలు చెప్పి బయటకు తీసుకు వెళ్ళాడు సాత్విక్ అనే యువకుడు. ఈ క్రమంలోనే అత్యాచారం చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. ఈ క్రమంలోనే తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం లోని పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు.