ఈ బాలుడు నిజంగా మృత్యుంజయుడే.. ఎందుకో తెలుసా?

praveen
మనిషికి చావు ఎప్పుడు వస్తుంది అన్నది చెప్పలేం అన్న విధం గానే ఉంటుంది.  కొన్నిసార్లు అనుకోని పరిస్థితులు కారణం గా ఊహించని విధంగా మృత్యువు దరిచేరుతూ  ఉంటుంది. అయితే మృత్యువు  దరిచేరిన సమయం లో కొంత మంది మాత్రం ఏకం గా మృత్యువు తో పోరాడి ప్రాణాలను కాపాడుకొని మృత్యుంజయులుగా మారి పోతు ఉంటారు. ఇక ఇలాంటి వారి గురించి అప్పుడప్పుడూ సోషల్ మీడియా లో తెగ చర్చ జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకునే పదేళ్ల బాలుడు కూడా ఇలాంటి మృత్యుంజయుడే అని చెప్పాలి.

 ఇటీవలి కాలంలో ఎంతో మంది బోరు బావులను పూడ్చ కుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తద్వారా ఆ బోరు బావులు ఎంతో మంది చిన్నారుల పాలిట మృత్యు శకటం గా మారి పోతున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఎంతో ఆనందం గా ఆడుకుంటున్న చిన్నారులు చివరికి బోరు బావులనలో పడి పోతూ ఉన్నారు. ఇక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల ఒక పదేళ్ల బాలుడు కూడా బోరుబావిలో పడి నూట నాలుగు గంటలపాటు అందులోనే ఉన్నాడు.

 అయినప్పటికీ ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడు గా మారిపోయాడు. ఈ ఘటన చత్తీస్ ఘడ్ లో వెలుగులోకి వచ్చింది. పదేళ్ల బాలుడి రాహుల్ సాహు మృత్యువును జయించాడు. బోరు బావిలో పడిన ఆ పిల్లాడు 104 గంటల తర్వాత ప్రాణాలతో బయటికి తీయగా.. వెంటనే ఆసుపత్రికి తరలించారు ఐసీయూలో అతనికి చికిత్స అందిస్తున్నారు. చాంపా జిల్లా ఫహారీద్ గ్రామానికి చెందిన రాహుల్ ఆడుకుంటూ 80 అడుగుల లోతైన బోరు బావిలో పడి పోయాడు. ఇక అతన్ని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం ఆర్మీ అధికారులు సైతం తీవ్రంగా శ్రమించారు. అతనికి ఊపిరి ఆగేలా చేసేందుకు బోరుబావి లోపలికి ఆక్సిజన్ పంపించారు అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: