ఏం ప్లాన్ వేశారు.. గూగుల్ మ్యాప్ సహాయంతో దొంగతనం?

praveen
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా దొంగల బెడద ఎక్కువైపోయింది. తాళం వేసి ఉన్న ఇల్లు కనిపించాయి అంటే చాలు రహస్యంగా లోపలికి వెళ్లడం అందినకాడికి దోచుకోవడం లాంటివి కూడా చేస్తున్నారు. ఇలా చోరీలకు పాల్పడేందుకు దొంగలు కొత్త దారులను వెతుకుతూ ఉండడం గమనార్హం. ఇక కొన్ని కొన్ని సార్లుచోరీలకు పాల్పడినందుకు దొంగలు ప్రయత్నించే తీరు చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతూ  ఉంటారు అని చెప్పాలి. ఇక్కడ మనం మాట్లాడుకునే దొంగలు మాత్రం కాస్త డిఫరెంట్..

 అందరు వివిధ రకాల రహస్య ఆయుధాలను ఉపయోగించి దొంగతనాలకు పాల్పడుతూ  ఉంటే.. వీళ్ళు మాత్రం సాంకేతిక పరిజ్ఞానంతో దొంగతనాలు చేస్తూ అందినకాడికి దోచుకో పోతున్నారు ఇక గూగుల్ మ్యాప్స్ నే తమ ఆయుధంగా  మార్చుకుంటూ చెలరేగిపోతున్నారు. అయితే అర్ధరాత్రి ఇళ్లల్లోకి దూరి సొత్తు కాజేసి తప్పించుకునే వారు. కూడా ఎన్నో రకాల వేషాలు వేయడం వీరి ప్రత్యేకత. కానీ ఇటీవలే ఈ ముఠాలో ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు వారి వద్ద నుంచి 44.5 తులాల బంగారం 1.2 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం గమనార్హం.

 హైదరాబాద్ నగరంలోని నేరేడ్మెట్ కమిషనరేట్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు కు చెందిన మురళి 22 ఏళ్ల వయసు నుంచి నేరాలకు పాల్పడుతూ ఉన్నాడు. అతనిపై ఇప్పటికి 37 కేసులు కూడా ఉన్నాయి. అతనిపై రెండుసార్లు పీడీ యాక్ట్ కూడా ప్రయోగించారు. అయితే 2021 ఆగస్టులో జైలు నుంచి బయటకు వచ్చిన మురళి నరసయ్య బంధువులు సురేష్ జంపయ్య పరమేష్ మల్లయ్య సారయ్య లతో కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఈ క్రమంలోనే ఊరికి దూరంగా ఉన్న నివాసాల్లోనే టార్గెట్గా చేసుకుంటూ ఉంటారు. రహదారికి కాస్త దూరంగా ఉన్న గ్రామాలను గూగుల్ మ్యాప్ ద్వారా వెతకడం అక్కడ ఏదో ఒక వేషంలో వెళ్లడం చివరికి అందినకాడికి దోచుకోవడం చేస్తున్నారు. ఇక మిగతా సభ్యులను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: