భార్య మ్యాగీ చేసిందని.. విడాకులు ఇచ్చిన భర్త?
మ్యాగి వల్ల భర్త భార్యకు విడాకులు ఇవ్వడం ఏంటి ఇదేదో విడ్డూరంగా ఉంది అని అనుకుంటున్నారు కదా.. అనుకోవడం ఏంటి ఇది నిజంగా విడ్డూరమే. మ్యాగీ చేసి పెట్టినందుకు భార్యకు విడాకులు ఇచ్చాడు భర్త. ఇంతకీ ఎందుకు అనుకుంటున్నారు కదా.. అది తెలియాలంటే కాస్త స్టోరీలోకి వెళ్లాల్సిందే.. భర్త భోజనప్రియుడు ఆమెకు మాత్రం వంట రాదు. దీంతో మ్యాగీ చేయడం ఒక్కటే వచ్చు. ఇంకేముంది బ్రేక్ ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇలా ప్రతి సమయంలో కూడా మ్యాగీ చేసి పెట్టింది.ఇంకేముంది భోజనప్రియుడు అయిన భర్తకు చిర్రెత్తుకొచ్చింది.
నాకు మ్యాగీ వద్దు.. మ్యాగీ చేసి పెట్టిన భార్య వద్దు అంటూ విడాకులు ఇప్పించాలంటూ కోర్టు మెట్లు ఎక్కాడు భర్త. చివరికి పరస్పర అంగీకారంతో కోర్టు కూడా విడాకులు మంజూరు చేయడం గమనార్హం. బళ్లారిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మైసూరుకు చెందిన జడ్జి ఎం ఎల్ రఘునాథ్ ఈ విషయాన్ని ఇటీవల వెల్లడించారు. నేటి రోజుల్లో భార్యాభర్తలు చిన్న విషయాలకే విడాకుల దాకా వెళ్తున్నారని చెబుతూ.. తాను పరిష్కరించిన కేసును గుర్తుచేసుకుంటూ ఆ వివరాలను వెల్లడించారు. అంతేకాదు ప్లేట్ కు ఒక పక్క పెట్టాల్సిన ఉప్పు డబ్బాను మరోపక్క పెట్టారని ఒకరు.. వెడ్డింగ్ సూట్ కలర్ బాలేదని మరొకరు కూడా ఆయన కెరీర్లో విడాకుల కోసం ఆయన దగ్గరికి వచ్చారట..