బాలుడు చేసిన పనికి.. 36 లక్షలు స్వాహా?
ఇక ఇప్పుడు అదే స్నేహితులతో సెల్ఫోన్ వేదికగా ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ ఉన్నారు. ఇక ఇలాంటి గేమ్స్ కి బానిసలుగా మారిపోయి చివరికి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. ఇక మరోవైపు పైసా పైసా కూడబెట్టి చెమటోడ్చి కష్టపడి పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు బ్యాంకుల్లో దాచుకున్న మొత్తాన్ని కూడా పిల్లలు ఆన్లైన్ గేమ్ లో అవగాహన లేమితో మొత్తం పోగొడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఆన్లైన్లో ఆటలాడి 36 లక్షలు పోగొట్టాడు ఇక్కడ ఒక బాలుడు.
అంబర్పేట్ కు చెందిన 16 ఏళ్ల బాలుడు తన తాత మొబైల్ తీసుకుని అందులో ఫ్రీ ఫైర్ గేమ్ డౌన్ లోడ్ చేశాడు. ఇక తాత ఫోన్లో ఉన్న తన తల్లి అకౌంట్ నుంచి మొదటి పదిహేను వందల రూపాయలు పెట్టి ఆట ఆడటం మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఒక్కో ఆటకు పది వేల రూపాయల చొప్పున డబ్బులు పెట్టాడు. ఎలా హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ నుంచి తొమ్మిది లక్షలు.. ఆ తర్వాత ఎస్బిఐ బ్యాంక్ ఖాతాలో నుంచి రెండు లక్షలు ఇక మరో మారు 1.6 లక్షలు, 1.45 లక్షలు ఇలా విడతలవారీగా మొత్తంగా 46 లక్షలు వాడాడు. ఇక బాలుడి తల్లి డబ్బులు అవసరమై బ్యాంకుకు వెళితే ఊహించని షాక్ తగిలింది. ఖాతా ఖాళీగా ఉండడంతో జరిగిన విషయం తెలుసుకొని పోలీసులను ఆశ్రయించింది.