తల్లి వరుస ఆమెతో వ్యక్తి అక్రమ సంబంధం..బాబాయ్ ఏం చేశాడటంటే?
ఈ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది..రాజస్థాన్లోని బికనీర్ జిల్లాలో వెలుగు చూసింది. హత్య కేసులో డాలూరామ్ను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. అతన్ని విచారణ చేస్తున్నామని, కేసు లో దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.. తీవ్రమైన గాయాల కారణంగా అతను చనిపోయిన తర్వాత శవాన్ని తీసుకొచ్చి ఊరి చివర పడేశాడు.మొదట అనుమానస్పద మృతి గా పోలీసులు కేసు నమోదు చేసుకున్న కూడా తర్వాత విచారణలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి.
ఊరి పొలిమేర్లలో ఒక యువకుడి శవం కనిపించడం తో ఆ ఊరి జనాలంతా షాకయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.. చనిపోయిన వ్యక్తిని కుశాల్ గా గుర్తించారు.ఎవరో హత్య చేశారని కాబట్టి పోస్టు మార్టం తప్పనిసరి అని పోలీసులు నచ్చజెప్పడంతో గ్రామస్థులు వెనక్కి తగ్గారు. పోస్టు మార్టం అనంతరం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు.. ఇదంతా వివాహేతర సంబంధం కారణంగా నే జరిగినట్లు తెలిసింది. మృతుడు కుశాల్ తన బాబాయ్ ఇంట్లో లేని సమయంలో కుశాల్ వచ్చేవాడని, అతనికి తన పిన్ని తో వివాహేతర సంబంధం ఉందని తేలింది. ఈ విషయం తెలిసిన బాబాయ్ డాలూరామ్ తన కోపాన్ని అణుచుకోలేకపోయాడు.. చివరికి దారుణంగా హత్య చేసాడు.. పోలీసుల ముందు అంగీకరించాడు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.