షాకింగ్ : పెళ్లి రోజు నాడే రంపంతో కోసేసిన భర్త?

praveen
కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది సామాన్యుల జీవితాలు అతలాకుతలం అయిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఇక కరోనా వైరస్ సమయంలో ఉపాధి దొరక్క పొట్టకూటి కోసం అప్పులు చేసిన వారు ఇక ఇప్పుడు అప్పులు తీర్చలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ డబ్బులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువవుతున్న నేపథ్యంలో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. మరి కొంతమంది తాము లేకుండా కుటుంబం ఎలా బ్రతుకుతుంది అని భయపడి ముందుగా కుటుంబ సభ్యులందరి ప్రాణాలు తీసి ఆ తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటున్నా హృదయ విదారక ఘటన లు నేటి రోజుల్లో అందరి మనసును కదిలిస్తున్నాయి అని చెప్పాలి.

 ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. అప్పుల బాధతో గత కొన్ని రోజుల నుంచి సదరు వ్యక్తి తీవ్ర మనస్థాపం లో మునిగిపోయాడు. ఇక చావే శరణ్యం అని అనుకున్నాడు. అయితే తాను లేకుండా భార్య పిల్లలు ఎలా బ్రతుకుతారో అని భయపడి చివరికి పెళ్లి రోజు నాడే భార్యాపిల్లలను దారుణంగా హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేరుకుని మరణించిన విషాదకర ఘటన తమిళనాడులోని చెన్నైలో వెలుగులోకి వచ్చింది. పోలీచ్చాలుం కు చెందిన 42 ఏళ్ల ప్రకాష్ ఐటీ సంస్థలో పని చేస్తున్నాడు. ఇక అతనికీ భార్య గాయత్రి కుమార్తె నిత్యశ్రీ కుమారుడు హరికృష్ణ ఉన్నారు.

 కాగా భార్య గాయత్రి నాటు మందుల దుకాణం నడుపుతూ ఉంది. అయితే గత కొంతకాలంగా ప్రకాష్ కి అప్పులు ఎక్కువైపోయాయి. దీంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఇక ఇటీవలే రాత్రి సమయంలో మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ప్రకాష్ తన ఇద్దరు పిల్లలు భార్యను కూడా ఏకంగా రంపంతో గొంతు కోసి దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉదయం సమయంలో ఎంతకీ వాళ్ళు బయటికి రాకపోవడంతో చివరికి స్థానికులు చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇక్కడ సూసైడ్ నోట్ లో అందరం కలిసి చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాం అంటూ రాసి ఉండడాన్ని గమనించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: