స్నేహితుడే కదా అని కలిసి పార్కు వెళ్తే.. నీచుడు ఏం చేశాడంటే?

praveen
మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకువస్తున్న అటు  రోజు రోజుకీ మహిళల పై వేధింపులు ఎక్కువ అవుతున్నాయ్ తప్ప ఎక్కడా తగ్గు ముఖం పట్టడం లేదు అని చెప్పాలి. ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా అడుగడుగునా మహిళలు లైంగిక వేధింపులకు ఎదుర్కొంటూనే ఉన్నారు. దీంతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మ కూడదో కూడా తెలియని దీన స్థితి లో పడి పోతున్నారు. మహిళలు ఎవరినైనా గుడ్డిగా నమ్మితే చివరికి సమయం సందర్భం వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి.

 ఇలా నేటి రోజుల్లో సభ్య సమాజం లో బ్రతుకుతున్న మనుషులను పశువులకన్నా హీనం గా ప్రవర్తిస్తున్నారు. చివరికి ఆడ పిల్లలపై అత్యాచారాలు పాల్పడుతున్న ఘటనలు అందరిని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి కోవకు చెందిన ఘటన వెలుగు లోకి వచ్చింది. ఏకంగా స్నేహితుడు అని నమ్మిన ఆ మహిళలు నయ వంచన చేశాడు సదరు వ్యక్తి. దారుణం గా అత్యాచారం చేశాడు. ఉత్తరప్రదేశ్లో వెలుగు లోకి వచ్చింది ఈ ఘటన. నోయిడాకు  చెందిన ఒక మహిళా స్నేహితుడే కదా అని అతనితో కలిసి పార్క్ కీ వెళ్ళింది. ఈ క్రమంలోనే అక్కడే వేచి చూస్తున్న సదరు యువకుడి స్నేహితులు అందరూ కలిసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు.

 ఇక ఆ తర్వాత మహిళను అక్కడే పార్కులో వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు దుండగులు. ఈ క్రమంలోనే బాధితురాలు జరిగిన విషయాన్ని ఇంట్లో చెప్పింది. వెంటనే కుటుంబ సభ్యుల సహాయంతో పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇక యువతిపై అత్యాచారానికి పాల్పడిన వారిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.  ఇక మరొకనిందితుడు పరారీలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: