30 రూ. ల గొడవ.. చివరికి హత్య,,?

praveen
ప్రస్తుతం మనిషి జీవన శైలిలో ఎన్నో రకాల మార్పులు వచ్చాయి. మూఢనమ్మకాలను వదిలేసి టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్నాడు మనిషి. ప్రతి విషయంలో గొప్పగా ఆలోచిస్తున్నాడు అని చెప్పాలి. కానీ కొన్ని విషయాలలో మాత్రం చివరికి విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నాడు అని తెలుస్తోంది. నాగరిక సమాజంలో అడుగుపెడుతున్న మనిషి ఎందుకో మానవత్వాన్ని మాత్రం మరిచిపోతున్నాడు అన్నది అర్ధమవుతుంది.

 ఇది ఎవరో చెబుతున్నది కాదు నేటి రోజుల్లో వెలుగు లోకి వస్తున్న ఘటనలే చెప్పకనే చెబుతున్నాయి. మనీ కీ విలువ ఇచ్చినంతగా మనుషులకు విలువ ఇవ్వడం లేదు. దీంతో సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి వెనక ముందు ఆలోచించడం లేదు. వెరసి క్షణికావేశంలో ఎంతోమంది ఏకంగా దారుణంగా హత్యలకు పాల్పడుతున్న ఘటనలు నేటి రోజుల్లో  వెలుగులోకి వస్తున్నాయి. ఇలా హత్యలకు పాల్పడిన వారు చివరికి  జైలు జీవితం అనుభవిస్తున్న  దుస్థితి వస్తుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. 30 రూపాయల విషయంలో జరిగిన గొడవ ఏకంగా ఒకరి ప్రాణాలు పోవడానికి కారణమైంది.

 అప్పు తీసుకున్న 30 రూపాయలు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు ముగ్గురు వ్యక్తులు కిరాణా దుకాణ దారుడిని చంపేశారు.. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని టందా దాన్ గ్రామం లో వెలుగు లోకి వచ్చింది. యశ్పాల్ అనే 50 ఏళ్ల వ్యక్తి కిరాణా కొట్టు నడుపు తున్నాడు. అయితే ఆయన వద్ద తీసుకున్న 30 రూపాయలు అప్పు తిరిగి ఇవ్వాలని కోరడం తో భూపేంద్ర ఆయన సోదరుడు యోగేంద్ర సహ మరొక వ్యక్తి యశ్ పాల్ పై కర్రల తో దాడి చేశారూ. ఈ క్రమం లోనే తీవ్రం గా గాయపడిన పడిన  యష్ పాల్  హాస్పటల్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. నిందితుల పై కేసు నమోదు చేసామని అదుపు లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: