మాయ మాటలతో నమ్మించి.. బాలికను మహారాష్ట్ర తీసుకెళ్ళాడు.. చివరికి?

praveen
ఇటీవల కాలంలో చదువుకుంటున్న సమయంలోనే విద్యార్థులు ప్రేమ అంటూ చెడు తిరుగుళ్ళు తిరుగుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. చదువుకోవాలని తల్లిదండ్రులు కళాశాల పాఠశాలలకు పంపిస్తే  అటు పిల్లలు మాత్రం పెడదారి పడుతు ఉన్నారు. దీంతో తల్లిదండ్రులకు ఊహించని షాక్ తగులుతుంది అని చెప్పాలి.  ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ప్రేమ పేరుతో ఒక బాలికను నమ్మించి  యువకుడు చివరికి బాలికను మహారాష్ట్రకు తీసుకువెళ్ళాడు.

 ఈ క్రమంలోనే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇటీవల వీరి ఆచూకీ కనుగొని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. నేపాల్కు చెందిన లక్ష్మణ్ కొన్నేళ్ళ క్రిందట నగరానికి వచ్చి స్థిరపడ్డాడు. అతని కుమారుడు కరుణ్ పారియర్ హిమాయత్నగర్లోని మోమోస్ లో పని చేస్తూ ఉన్నాడు. అయితే తొమ్మిదో తరగతి చదువుతున్న తన అత్త కూతురు ని  ప్రేమిస్తున్నాడు సదరు యువకుడు. ఈ క్రమంలోనే మాయమాటలతో బాలికను  ప్రేమలో దింపాడు.ఇక ఇటీవల ఇంట్లో చెప్పకుండా మహారాష్ట్రలోని కళ్యాణ్ నగరానికి బాలికను తీసుకు వెళ్ళాడు.

 ఒక గది అద్దెకి తీసుకుని అక్కడే ఆ బాలిక తో పాటు వారం రోజుల పాటు ఉన్నాడు. అయితే తమ కుమార్తె కనిపించడం లేదని బాలిక తల్లి దండ్రులు ఫిర్యాదు చేయడం తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమం లోనే కాస్త వినూత్నం గా ఆలోచించిన పోలీసులు కరణ్ అన్న రాము ఫేస్బుక్ ఖాతాలో తండ్రి, అన్నపై కేసు నమోదైంది. ఏ క్షణంలోనైనా అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉంది అని పోస్ట్ పెట్టారు. దీంతో వెంటనే కరణ్ తన సోదరుడు రాము కి ఫోన్ చేసి మహారాష్ట్రలోని కళ్యాణ్ లో ఉన్నట్లు చెప్పాడు.ఈ క్రమంలోనే పోలీసులు అక్కడ మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించి ఇక చివరికి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: