పరోటా పార్శిల్ లో పాము.. కస్టమర్ ఏం చేశాడో తెలుసా?

Satvika
కొన్ని ప్రాంతాల్లో పాములను నూడిల్స్ తిన్నట్లు తింటున్నారు.ధాయ్‌లాండ్, చైనా లాంటి దేశాలతో పాములకు సంబంధించిన ఆహార పదార్థాలు కూడా ఉంటాయి. పాములను చూస్తేనే చాలా మందికి అదో రకమైన ఫీలింగ్ కలుగుతుంది. అలాంటిది ఎలా తింటారు అనే సందేహం అందరికి రావడం సహజం.అలాంటి మన దగ్గర ఓ ఫుడ్ పార్శిల్‌లో పాము చర్మం కనిపిస్తే ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోండి..వామ్మో ఒళ్ళు జర్దరిస్తుంది కదూ..అచ్చం అలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. కేరళ లో ఈ ఘటన చోటు చేసుకుంది.


వివరాల్లొకి వెళితే..కేరళ రాజధాని తిరువనంతపురం శివారులో చెల్లంకోడ్ ప్రాంతంలో ఓ వ్యక్తి సమీప హోటల్‌కు వెళ్లి పరోటా పార్శిల్ తెచ్చుకున్నాడు. ఇంటికి వెళ్లి పార్శిల్ విప్పి తిందామని చూస్తే పరోటా కంటే ముందే అతనికి చర్మం లాంటిదేదో కనిపించింది. అదేంటా అని పరిశీలనగా చూస్తే ఒక్క సారిగా ఖంగుతిన్నారు.నాలుగైదు ఇంచ్‌ల పొడవున్న ఆ పాము చర్మాన్ని చూడగానే ఆయనకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. అలా వదిలేస్తే ఆ హోటల్ వాళ్లు ఈ సారి పాముల్నే పంపుతారని అనుకున్నాడేమో నేరుగా వెళ్లి ఫుడ్ సేప్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు..


హోటల్ లో ఇలాంటి ఘటన వెలుగు చూడటం తో వాళ్ళు కూడా షాక్ అయ్యారు.సీరియస్‌గా తీసుకుని వెంటనే ఆ హోటల్‌లో తనిఖీలు చేశారు. కిచెన్ మొత్తం దారుణంగా ఉండటంతో వెంటనే సీజ్ చేశారు. అయితే ఆ హోటల్‌కు అన్ని అనుమతులు ఉన్నాయని అదికారులు చెబుతున్నారు. హోటల్ కమస్టర్‌కు ఇచ్చిన పాము చర్మం ఎక్కడి నుంచి వచ్చిందనేదానిపై ఆరా తీశారు. అయితే హోటల్ వాళ్లు కూడా ఏమీ చెప్పలేకపోయారు.ఇక వాళ్ళు చేయాలనీ అనుకున్న పనిని చేశారు.అన్నీటిని తీసుకొని ల్యాబ్ కు పంపారు..కేరళలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికే పేపర్లలో ప్లాస్టిక్ కవర్లలో ఆహార పదార్థాల్ని పార్శిల్ చేయడాన్ని నిషేధించారు. అయితే చాలా హోటళ్లు వాటిని పాటించడం లేదు..ఇప్పుడు ఇది కలకలం రేపుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: