దివ్యాంగురాలు పై కామాంధుల కన్ను.. చివరికి?

praveen
మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు తీసుకు వస్తున్న   కఠిన చట్టాలు కేవలం చెప్పు కోవడానికి మాత్రమే పరిమితం అవుతున్నాయి. మహిళ పై అత్యాచారానికి పాల్పడిన కామాంధులలో  మాత్రం ఎక్కడ మార్పులు తీసుకు రావడం లేదు అని అర్థమవుతుంది. ఎందుకంటే రోజు రోజుకు ఆడ పిల్లల పై జరుగు తున్న అత్యాచార ఘటనలు పెరిగి పోతున్నాయి తప్ప ఎక్కడా తగ్గు ముఖం పట్టిన దాఖలాలు మాత్రం కనిపించటం లేదు. దీంతో ప్రతిక్షణం ఆడపిల్ల భయ పడుతూనే బతకాలా పరిస్థితి ఏర్పడింది.

 ఆడపిల్ల ఒంటరిగా కనిపించిందంటే చాలు ఇక మగాడిలో ఉండే మృగం బయటికి వస్తుంది. పశువుల మీద పడిపోయి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమం లో నే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అభం శుభం తెలియని ఆడపిల్లలు కామపు కొరల్లో చిక్కుకొని బలి అవుతున్న ఘటనలు ఎన్నో వెలుగు లోకి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి ఒక అమానవీయ ఘటన వెలుగు లోకి వచ్చింది. ఆమె మానసిక వైకల్యం ఉన్న ఒక దివ్యాంగురాలు. కానీ ఆమె పై కన్నేశారూ కామందులు.

 చివరికి దారుణం గా దివ్యాంగురాలు పై అత్యాచారం చేశారూ. సంగారెడ్డి లో వెలుగు లోకి వచ్చింది ఈ ఘటన. ఒక కాలనీకి చెందిన 20 ఏళ్ల దివ్యాంగురాలు తల్లి దండ్రులు చిన్నప్పుడు మరణించడం తో చిన్నమ్మ వద్ద ఉంటుంది. పుల్కల్ మండలం కి చెందిన రాములు అనే 48 ఏళ్ల వ్యక్తి ముఖుమ్ నగర్కు చెందిన చావుస్ అనే 65 ఏళ్ల వ్యక్తి  మానసిక దివ్యాంగుల యువతికి మాయ మాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటన ఆలస్యం  గా వెలుగు లోకి వచ్చింది. ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ఈ ఘటన స్థానికం గా సంచలనం గా మారి పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: