విడాకుల కోసం కోర్టుకు భార్య.. అందరి ముందే భర్త ఏం చేసాడో తెలుసా?
అంతేకాదు ఇక వందేళ్ల పాటు కలిసి ఉంటామని పెద్దల సాక్షిగా ప్రమాణం చేసి దాంపత్య జీవితం లోకి అడుగుపెట్టిన వారు కొన్నాళ్ళకే చివరికి విడాకులు తీసుకొని వేరు పడిన ఘటనలు కూడా నేటి రోజుల్లో పెరిగిపోతూనే ఉన్నాయి అని చెప్పాలి. భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవలనే పెద్దగా మార్చుకుంటూ కాపురంలో చేజేతులా చిచ్చు పెట్టుకుంటున్నారు. అయితే ఇలా కట్టుకున్న వారిపై కక్ష పెంచుకుని హతమార్చుతున్న ఘటనలు మాత్రం అందరిని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయ్. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. భార్యతో విడాకుల కోసం కోర్టుకు వచ్చిన ఒక భర్త అందరూ చూస్తుండగానే భార్య పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.
ఈ ఘటనతో కోర్టులో ఉన్న అందరూ కూడా ఒక్కసారిగా షాకయ్యారు. తమిళనాడులోని పెరంబలూర్ జిల్లా కోర్టు వద్ద ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.సుధా, కామరాజ్ అనే దంపతులు విడిపోయి గత కొన్నేళ్లుగా వేరుగానే ఉంటున్నారు. ఇటీవలే విడాకులు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఈ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. ఇకపోతే ఇటీవల కేసు విచారణ నిమిత్తం భార్యాభర్తలిద్దరూ కూడా అనుకోకుండా ఒకే బస్సులో ప్రయాణం చేసి వచ్చారు. కోర్టు వద్ద బస్సు దిగగానే తనతో పాటు తెచ్చుకున్న కత్తితో రామరాజు తన భార్యపై దాడి చేశాడూ. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని హత్యాయత్నం నేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు తరలించారు. ఇక గాయపడిన మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..