సినిమా సీన్ రిపీట్.. ఐటీ అధికారుల దాడులు.. చివరికి?
సాధారణంగా గోడలు బద్దలు కొడితే ఇటుకలు బయటకి వస్తాయి. కానీ ఇక్కడ మాత్రం ఒక వ్యాపార సంస్థ కార్యాలయ గోడలు బద్దలు కొడితే ఇటుకలు కాదు నోట్లకట్టలు బయటికి వచ్చాయి. ఈ ఘటన ముంబైలో వెలుగులోకి వచ్చింది. కేవలం గోడలను బద్దలు కొడితే మాత్రమే కాదు నేలను తవ్వి చూసినా కూడా నోట్ల కట్టలు వెండి ఇటుకలు బయట పడ్డాయి అనే చెప్పాలి. కల్పదేవి ప్రాంతంలో 35 చదరపు అడుగుల కార్యాలయంలో రహస్యంగా దాచి ఉంచిన సుమారు 10 కోట్ల విలువైన సొత్తును అధికారులు గుర్తించారు. చాముండా అనే వ్యాపారి కి చెందిన కార్యాలయంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించగా.. నేలలో ఏర్పాటు చేసిన రహస్య అరల నుంచి 9.8 కోట్ల నగదు 13 లక్షల విలువైన 19 కేజీల వెండి ఇటుకలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ క్రమంలోనే మహారాష్ట్ర జీఎస్టీ అధికారులు ఈ డబ్బు మొత్తాన్ని సీజ్ చేశారు అని చెప్పాలి. కల్ప దేవి సహా మూడు ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. 35 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కార్యాలయంలో ఏమీ లభించలేదు. కానీ గదిలో నేలపై ఏర్పాటు చేసిన టైల్స్ నిశితంగా పరిశీలించిన అధికారులు ఓ మూలన కొద్దిగా భిన్నంగా కనిపించింది. అనంతరం నగదు నింపిన నోట్లకట్టలు కనిపించాయి. అయితే తనకు ఏమీ తెలియదని కంపెనీ యజమాని అతని కుటుంబ సభ్యులు చెప్పడంతో అధికారులు తమను ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే గోడ లో ఉన్న రహస్య అరలో గురించి అందులో నగదు బయట పడటం గురించి స్థానికంగా సంచలనం గా మారిపోయింది. అధికారులు సైతం ఇక్కడ చూసి షాక్ అయ్యారూ..